Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు కలిసి జీవించాలన్న న‌టి

మీరు సంబంధం క‌లుపుకోవాల‌నుకుంటే.. పెళ్లి చేసుకునే ముందు కలిసి జీవించాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను.

By:  Tupaki Desk   |   19 April 2024 2:45 AM GMT
పెళ్లికి ముందు కలిసి జీవించాలన్న న‌టి
X

పెళ్లికి ముందు జంటలు కలిసి జీవించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌, ప్రాముఖ్యత గురించి ప్రముఖ నటి జీనత్ అమన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల‌తో ఏకీభ‌వించారు యువ‌న‌టి కం ద‌ర్శ‌కురాలు దివ్య ఖోస్లా. భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో తనవైన‌ విలక్షణమైన పాత్రలతో పాపుల‌రైన వెట‌ర‌న్ స్టార్ జీనత్ అమన్ పెళ్లికి ముందు జంటలు కలిసి జీవించాల్సిన‌ ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

మీరు సంబంధం క‌లుపుకోవాల‌నుకుంటే.. పెళ్లి చేసుకునే ముందు కలిసి జీవించాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను. ఇద్దరు లైవ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న జంట‌ల‌కు నా స‌ల‌హా ఇదే. నా కొడుకులకు నేను ఎప్పుడూ ఇచ్చే సలహా ఇదేన‌ని అన్నారు. ఇద్దరు వ్యక్తులు వారి కుటుంబాలు, కుటుంబ పాల‌కులు ఈ జంట‌ సమీకరణంలో పాలుపంచుకునే ముందే ఆ జంట‌ తమ రిలేష‌న్‌షిప్ ని అంతిమ పరీక్షకు పెట్టడం స‌రైన‌దేన‌ని నాకు లాజికల్‌గా అనిపిస్తుంది. రోజుకు కొన్ని గంటల పాటు మీకు మీరు ఉత్తమ వెర్షన్‌గా ఉండటం సులభం. అయితే మీరు జంట‌గా బాత్రూమ్‌ను షేర్ చేస్కోగ‌ల‌రా? బ్యాడ్ మూడ్ తాలూకా తుఫాన్‌ వాతావరణంలో ఉన్నారా? ప్రతి రాత్రి డిన్నర్‌లో ఏమి తినాలో అంగీకరిస్తున్నారా? పడకగదిలో అగ్నిని సజీవంగా ఉంచాలా? సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య అనివార్యంగా తలెత్తే మిలియన్ల చిన్న సంఘర్షణలతో క‌లిసి ఉండాలా? ఇవ‌న్నీ తెలియాలి క‌దా? అని జీన‌త్ అభిప్రాయ‌ప‌డ్డారు.

36 ఏళ్ల అందాల క‌థానాయిక దివ్య ఖోస్లా సీనియ‌ర్ న‌టీమ‌ణి జీన‌త్ అభిప్రాయంతో ఏకీభ‌వించారు. పెళ్లికి ముందు స‌హ‌జీవ‌నం స‌రైన‌దేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. `యారియన్ 2`లో తన అద్భుత‌ నటనకు ప్రశంసలు అందుకున్న దివ్య ఖోస్లా బహుముఖ ప్రజ్ఞావంతురాలు. యారియాన్, స‌న‌మ్ రే లాంటి చిత్రాల‌కు దివ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌టిగాను మంచి పేరు తెచ్చుకున్న ప్ర‌తిభావ‌ని. టీసిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ స‌తీమ‌ణిగాను సుప‌రిచితురాలు.