Begin typing your search above and press return to search.

న‌టి బుర్ర నిండా గులాబీలు పూసాయి

జెండయా తన గోతిక్ విక్టోరియన్ రూపంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. లా రోచ్ దీనితో స్టైలింగ్ చేసారు. ముఖ్యంగా గులాబీ పూలతో డిజైన్ చేసిన‌ హెడ్‌పీస్ (గులాబీ గుత్తి) త‌ల‌పై ఎంతో అందంగా కుదిరింది.

By:  Tupaki Desk   |   7 May 2024 4:03 PM GMT
న‌టి బుర్ర నిండా గులాబీలు పూసాయి
X

మెట్ గాలా ఈవెంట్ విచిత్ర‌మైన వేష‌ధార‌ణ‌ల‌కు నెల‌వుగా మారింది. ఇంత‌కుముందు ఇషా అంబానీ లాంగ్ శారీ గౌన్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ గౌన్ ని ప‌రిచేందుకు విశాల‌మైన స్థ‌లం అవ‌స‌ర‌మైంది. డూన్ న‌టి జెండ‌యా మెట్ గాలా వేడుక‌లో ఇంత‌కుముందు ఒక వినూత్న‌మైన వ‌స్త్రాన్ని ధ‌రించి అంద‌రికీ షాకిచ్చింది. ఇప్పుడు రెండోసారి ఇదే వేదిక‌పై ఇంచుమించు అలాంటి మ‌రో వెరైటీ డిజైన‌ర్ డ్రెస్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది.





నేటి ఉద‌యం టల్లే మైసన్ మార్గీలా గౌనులో క‌నిపించిన తర్వాత జెండయా.. సాయంత్రానికి మళ్లీ మెట్ గాలా 2024 రెడ్ కార్పెట్‌పై కొత్త లుక్‌లో క‌నిపించింది. బాడ్ బన్నీ, జెన్నిఫర్ లోపెజ్, క్రిస్ హేమ్స్‌వర్త్‌లతో కలిసి ఈవెంట్‌కు కో-ఛైర్‌గా ఉన్న జెండ‌యా.. గివెన్చీ డిజైన్ చేసిన‌ స్ప్రింగ్ 1996 హాట్ కోచర్ కలెక్షన్ నుండి డ్ర‌మ‌టిక్ బ్లాక్ గౌను ధ‌రించింది. ఆఫ్-ది షోల్డర్ నెక్‌లైన్, బోర్డర్‌లలో టల్లే రఫిల్డ్ ఎంబ్రాయిడరీ, ఫుల్-లెంగ్త్ బిలోవీ స్లీవ్‌లు, భారీ స్కర్ట్ .. వెనుక భాగంలో భారీ రెయిలింగ్ ...ఇవ‌న్నీ ఈ దుస్తుల‌కు హుందాత‌నాన్ని ఆపాదించాయి.





జెండయా తన గోతిక్ విక్టోరియన్ రూపంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. లా రోచ్ దీనితో స్టైలింగ్ చేసారు. ముఖ్యంగా గులాబీ పూలతో డిజైన్ చేసిన‌ హెడ్‌పీస్ (గులాబీ గుత్తి) త‌ల‌పై ఎంతో అందంగా కుదిరింది. ఎరుపు, పసుపు, ముత్యాల తెలుపు గులాబీలతో ఈ అలంక‌ర‌ణ హైలైట్ గా నిలిచింది. డైమండ్ డ్రాప్ చెవిపోగులు- హై హీల్స్‌తో బ్లాక్ గౌన్ లో మిల‌మిలా మెరిసింది. జెండ‌యా రూపం చూశాక గులాబీ బాల ఎంత ముచ్చ‌ట‌గా ఉంది! అంటూ తెలుగు యూత్ ఫిదా అయిపోతోంది.

జెండ‌యా ఎవ‌రు?

ఇటీవ‌ల భారీ యాక్ష‌న్ చిత్రం డూన్ లో న‌టించింది జెండ‌యా. హాలీవుడ్ లో ప‌లు యాక్ష‌న్ అడ్వెంచ‌ర్లలో అద్భు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ఈ 27 ఏళ్ల బ్యూటీ. జెండ‌యా పూర్తి పేరు చాలా పెద్ద‌ది. జెండయా మేరీ స్టోర్మర్ కోల్‌మన్ అస‌లు పేరు. 1 సెప్టెంబర్ 1996న జన్మించింది. జెండ‌యా అమెరికన్ నటి కం గాయని. ఆమె రెండు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సహా పలు ప్రశంసలను అందుకుంది. టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఒక్కో సినిమాకి కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకుంటోంది.