కొత్త డైరెక్టర్ కోసం ప్రశాంత్ వర్మ ఎదురు చూస్తున్నాడా?
యంగ్ హీరో తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `జాంబిరెడ్డి` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jan 2025 5:39 AM GMTయంగ్ హీరో తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `జాంబిరెడ్డి` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే తేజ సజ్జాకి మంచి గుర్తింపు దక్కింది. దర్శకుడు ప్రశాంత్ వర్మకు సరైన కమర్శియల్ హిట్ గాను నిలిచింది.
నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన చిత్రం 12 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో `జాంబీరెడ్డి -2` కూడా ఉంటుందని ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే అటుపై ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో పాన్ ఇండియాలో సంచలన మవ్వడంతో ` జాంబిరెడ్డి -2` గురించి మళ్లీ చర్చ ఎక్కడా రాలేదు. పాన్ ఇండియాలో ఫేమస్ అయిన తర్వాత `జాంబిరెడ్డి -2` తీయాల్సిన అవసరం అతడికి ఏముంటుందనే అంశం హైలైట్ అయింది.
అందుకు తగ్గట్టే ప్రశాంత్ వర్మ కొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే `జాంబిరెడ్డి -2` మాత్రం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించకపోయినా ఆ బాధ్యత మరో ప్రతిభావంతుడికి వర్మ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. జాంబిరెడ్డి స్టోరీ ఇప్పటికే వర్మ సిద్దం చేసి పెట్టాడు. దాన్ని టేకప్ చేసి పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగే వారుంటే చాలు..బ్యాకెండ్ అంతా ప్రశాంత్ వర్మ నడిపిస్తాడు.
ఇప్పుడిదే ప్లానింగ్ తో ప్రశాంత్ వర్మ ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం వర్మ సరైన ప్రతిభావంతుడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి సితార ప్రొడక్షన్స్ ముందుకొస్తుంది. మరోవైపు ఆ సంస్థ అధినేత కూడా సరైన డైరెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. డైరెక్టర్ కుదిరితే ఈ ప్రాజెక్ట్ ని వెంటనే పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.