Begin typing your search above and press return to search.

ఫైనాన్స్ రంగంలోకి అదానీ ఎంట్రీ.. తొలి ప్రాజెక్టు ఇదే

తాజాగా ఆర్థిక రంగంలోకి తాను ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అదానీ గ్రూప్ వెల్లడించింది. ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అదీనీ సంస్థ ఆవిష్కరించింది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:22 AM GMT
ఫైనాన్స్ రంగంలోకి అదానీ ఎంట్రీ.. తొలి ప్రాజెక్టు ఇదే
X

వ్యాపారం చేసే వేళలో కొందరు కొన్ని వ్యాపారాల్లో మాత్రమే తమ సత్తా చాటుతుంటారు. వ్యక్తులు మాత్రమే కాదు కొన్ని కంపెనీలు సైతం ఇదే పరిస్థితి. దాదాపు చాలా కంపెనీలు తమదైన కొన్ని రంగాలకే పరిమితం అవుతుంటారు. టాటా.. రిలయన్స్ లాంటి సంస్థలు అందుకు మినహాయింపు. వారికి మించినట్లుగా వ్యవహరించే వ్యాపార దిగ్గజం మరొకరు ఉన్నారు. అదే.. అదానీ గ్రూప్. గౌతమ్ అదానీ సారధ్యంలో నడుస్తున్న అదానీ గ్రూప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాము ఒకసారి డిసైడ్ అయితే.. ఇక అంతే అన్నట్లుగా వారి తీరు ఉంటుంది.

వారి పయనం సైతం మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలకు తోడుగా తాజాగా మరో కొత్త వ్యాపార రంగంలోకి వారు అడుగు పెట్టారు. తాజాగా ఆర్థిక రంగంలోకి తాను ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అదానీ గ్రూప్ వెల్లడించింది. ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అదీనీ సంస్థ ఆవిష్కరించింది. గ్రూప్ నకు చెందిన అదానీ వన్ యాప్ వినియోగదారులు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవటానికి.. విమాన స్థితిని తెలుసుకోవటానికి.. ఎయిర్ పోర్టుల్లోని లాంజ్ లోకి ప్రవేశించేందుకు.. కొన్ని తరహా షాపింగ్ నకు.. క్యాబ్.. పార్కింగ్ లాంటి సదుపాయాలకు వినియోగించుకోవటానికి వీలుగా ఈ కార్డుల్ని వినియోగించుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ తో పాటు వీసాతో కలిసి ఎయిర్ పోర్టు ఆధారిత ప్రయోజనాల్ని పొందేందుకు వీలుగా తొలిసారి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అదానీ విడుదల చేసింది. దేశ డిజిటల్ ప్రయాణంలో భాగంగా తన వంతుగా అదానీ గ్రూప్ అదానీ వన్ యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిపే వీలుంది.

అదానీ క్రెడిట్ కార్డు విషయానికి వస్తే.. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాండ్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక రుసుము రూ.5వేలుకాగా.. దాన్ని తీసుకున్న వారికి రూ.9వేల వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. అదే సమయంలో అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డును తీసుకున్న వారు ఏడాదికి రూ.750 చెల్లించాల్సి వస్తుంది. కానీ.. రూ.5వేల వరకు విలువైన ప్రయోజనాలు పొందే వీలుంది. మరి..కొత్త వ్యాపారంలో మరెంతగా విస్తరిస్తారో చూడాలి.