Begin typing your search above and press return to search.

మధ్యంతర బడ్జెట్ సరే.. పూర్తిస్థాయి బడ్జెట్ ఎప్పుడు?

పేదలు.. మధ్యతరగతి వర్గాలతో పాటు.. ఉద్యోగులు.. వ్యాపారులు సైతం ఎన్నో ఆశలతో ఈ బడ్జెట్ వైపు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:27 AM GMT
మధ్యంతర బడ్జెట్ సరే.. పూర్తిస్థాయి బడ్జెట్ ఎప్పుడు?
X

మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. షెడ్యూల్ లో భాగంగా ఇలాంటి వేళల్లో మధ్యంతర బడ్జెట్ ను చేపట్టటం తెలిసిందే. ఎన్నికల ఏడాది కావటంతో మధ్యంతర బడ్జెట్ తో కొత్త ఆశలతో సగటు జీవి ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. పెరిగిన గ్యాస్ ధరలతో పాటు.. అంతర్జాతీయంగా తగ్గినముడి చమురు ధరల నేపథ్యంలో ఏమైనా ఊపశమనం కలిగే చర్యలు ఉంటాయా? అన్న అంశంతో పాటు.. ప్రజాకర్షక నిర్ణయాల్ని ఏమైనా ప్రకటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పేదలు.. మధ్యతరగతి వర్గాలతో పాటు.. ఉద్యోగులు.. వ్యాపారులు సైతం ఎన్నో ఆశలతో ఈ బడ్జెట్ వైపు చూస్తున్నారు. ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటల వేళలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. మరో యాబై రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. పూర్తి స్థాయి పద్దు కాకుండా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టున్నారు. ఎన్నికలు జరిగే ప్రస్తుత కాలానికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

మరి.. పూర్తిస్థాయి బడ్జెట్ మాటేమిటి? అంటే.. సార్వత్రిక ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను మళ్లీ ప్రవేశ పెడతారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిర్ణయాలు ఉండే అవకాశం పెద్దగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాకుంటే.. ఎన్నికల వేళలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావటంతో అంతో ఇంతో ప్రజాకర్షక విధానాల్ని ప్రకటించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలాసీతారామన్ ప్రవేశ పెడుతున్న ఆరో బడ్జెట్ కాగా.. మోడీ సర్కారు 2 ప్రవేశ పెడుతున్న చిట్టచివరి బడ్జెట్ పద్దుగా చెప్పాలి. గడిచిన పదేళ్లలో సర్కారు సాధించిన విజయాల్ని తెలియజేస్తూ.. ఇకపై దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళతామన్న విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేసే అవకాశం ఉందంటున్నారు. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మధ్యంతర బడ్జెట్ లో రైతులను ఆకట్టుకునేలా పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా అందించే పెట్టుబడి సాయాన్ని పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు ఎకరానికి రూ.6వేలు ఇస్తుంటే.. దాన్ని రూ.9వేలకు పెంచే వీలుందని చెబుతున్నారు.

అదే సమయంలో ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తున్న రూ.5లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ను రూ.10 లక్షలకు పెంచుతూ ప్రకటన వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది. సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం బావిస్తోంది. ఇందుకోసం రాయితీలను పెంచే అవకాశం ఉంది. అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ఆదాయపన్ను భారం ఎంతమేర తగ్గిస్తారన్న దానిపై బోలెడు ఆశలు నెలకొన్నాయి. మరి.. మోడీ సర్కారు ఎంతమేర తీరుస్తుందో చూడాలి.