రాబిన్ హుడ్ క్రెడిట్ కార్డు.. ‘గోల్డె ఎహె’..10 లక్షలమంది వెయింటిగ్
15 ఏళ్ల కిందట క్రెడిట్ కార్డులంటే మహా స్టేటస్ సింబల్.. పదేళ్ల కిందటి వరకు కూడా క్రెడిట్ కార్డుల జారీ అంత సులభంగా జరిగేది కాదు.. కానీ, ఇప్పుడు ఒక్కొక్కరి వద్ద పదుల కొద్దీ కార్డులు ఉంటున్నాయి.
By: Tupaki Desk | 12 Dec 2024 12:30 AM GMT15 ఏళ్ల కిందట క్రెడిట్ కార్డులంటే మహా స్టేటస్ సింబల్.. పదేళ్ల కిందటి వరకు కూడా క్రెడిట్ కార్డుల జారీ అంత సులభంగా జరిగేది కాదు.. కానీ, ఇప్పుడు ఒక్కొక్కరి వద్ద పదుల కొద్దీ కార్డులు ఉంటున్నాయి. వీటిలో మాస్టర్, వీసా, రూపే, డైనర్స్ క్లబ్, అమెరికన్ ఎక్స్ ప్రెస్.. ఇలా రకరకాలు.. ఇప్పుడు మెటల్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. అయితే, ఒక్కో దానికి ఒక్కో రూల్.. కొన్నిటికి జాయినింగ్ ఫీజు.. మరికొన్ని ఫ్రీ.. ఇంకొన్నిటికి రెండో ఏడాది నుంచి రుసుము.. రివార్డు పాయింట్లు.. క్యాష్ బ్యాక్ లు.. డిస్కౌంట్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే క్రెడిట్ కార్డుల కథాకమామిషు పెద్దదే. మె
అయితే, ఇప్పుడు అమెరికన్లు మాత్రం ఒక కార్డు కోసం తహతహలాడుతున్నారట.
మాకో కార్డు కావాలి నాయనా..
లడ్డూ కావాల నాయనా..? అనే తరహాలో అమెరికన్లు మాకు ఆ కార్డు కావాలి నాయనా? అంటున్నారట.. ఎందుకంటే.. దాని స్టయిల్ అలా ఉందట.. దీనిని జారీ చేస్తున్నది రాబిన్ హుడ్ సంస్థ. పైగా గోల్డ్ క్రెడిట్ కార్డు.. అందుకే ఇంత విపరీతమైన క్రేజ్. ఆర్థిక సేవల సంస్థ (ఫిన్ టెక్) అయిన రాబిన్ హుడ్ గోల్డ్ మెటల్ కార్డును తెచ్చింది. దీని డిజైన్ ను చూసి ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్ మహా ఖుష్ అవుతున్నాడట.
ప్రముఖుడు కావడంతో ఇటీవల ఆయనకు గోల్డ్ క్రెడిట్ కార్డును పంపింది రాబిన్ హుడ్. అయితే, కార్పొరేట్ మార్కెటింగ్ స్ట్రాటజీగా తొలుత భావించినా.. తర్వాత అసలు కథ చూసి అభిప్రాయం మార్చుకున్నాడట. ఆ డిజైన్ అంతగా ఆకట్టుకుందట.
రాబిన్ హుడ్ సంస్థ రిటైల్ బ్రోకరేజీ సేవలను అందిస్తుంది. నెల క్రితం ఈ గోల్డ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించినప్పటికీ బంగారు కోటింగ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కార్డు అంటున్నారు. ఇక బరువు 17 గ్రాములు.. 10 క్యారెట్ల స్వచ్ఛత సరేసరి. అందుకే ఎంపిక చేసిన వారికి మాత్రమే మంజూరు చేస్తున్నదట. ఇలానే అల్ట్ మన్ కూ అందించింది.
వీసానే.. మంచి నెట్ వర్కే..
ప్రస్తుతం ఉన్న క్రెడిట్ కార్డుల్లో ‘వీసా’ నెట్ వర్కే ఉత్తమం. మాస్టర్, రూపే తదితర నెట్ వర్క్ లకు అనేక చార్జీలు, పరిమితులు ఉన్నాయి. ఇక గోల్డ్ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై 3 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంట. పైగా యాన్యువల్ ఫీజు లేదట. అంతేకాదు.. విదేశీ లావాదేవీలపైనా ఫీజూ లేదట అందుకే అమెరికాలో ఈ క్రెడిట్ కార్డుకు మా బాగా డిమాండ్. ఎంతగా నంటే.. 10 లక్షలమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండేంత.