Begin typing your search above and press return to search.

ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ స్థానం ఇదే..!

నీతి అయోగ్ విడుదల చేసిన ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ జాబితాలో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది.

By:  Tupaki Desk   |   25 Jan 2025 4:30 PM GMT
ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ స్థానం ఇదే..!
X

నీతి అయోగ్ విడుదల చేసిన ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ జాబితాలో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. 2022 - 23 ఏడాదికి సంబంధించి నీతి అయోగ్ ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది.

ఈ జాబితాలో మొత్తం 18 రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చిన నీతి అయోగ్.. అనేక అంశాలను ఇందుకోసం పరిగణలోకి తీసుకుంది. ఇందులో భాగంగా ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ (ఆర్థిక ఆరోగ్య సూచిక) లో తెలంగాణ 43.6 ఆరు స్కోరుతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 67.8 స్కోర్ తో ఒరిస్సా రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. అటు ఏపీ జాబితాలో 17వ స్థానంలో నిలిచి అత్యంత దారుణమైన పనితీరును కరంబరిచిన రాష్ట్రంగా మిగిలింది.

ఈ ర్యాంకులను కేటాయించేందుకు నీతి అయోగ్ అనేక అంశాలను పరిశీలించింది. ప్రధానంగా జిడిపి, ప్రజా వ్యయం, ఆదాయాలు, ఆర్థిక స్థిరత్వానికి వారి సహకారం ఆధారంగా 18 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యాన్ని నివేదిక అంచనా వేసి ఈ జాబితాను విడుదల చేసింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద ఆవిష్కరించిన ఈ నివేదికలో తెలంగాణ 43.6 ఎఫ్హెచ్ఐ స్కోర్ తో తెలంగాణను ఫ్రంట్ రన్నర్ విభాగంలో చేర్చింది. మరోవైపు ఆర్థిక వివేకం, అరుణ సూచిక రెండింటిలోనూ తొమ్మిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం వండడం గమనార్హం.

ఆదాయ సమీకరణలో తెలంగాణ రాణించి రెండో స్థానంలో నిలిచింది. సమర్థవంతమైన పన్ను వసూలు వ్యవస్థలతో తెలంగాణ బలమైన సమీకరణను ప్రదర్శించింది. కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే తక్కువ బాకీలు - జిఎస్డిపి నిష్పత్తి ఉన్నప్పటికీ.. తెలంగాణ యొక్క అత్యుత్తమ ఆదాయ పనితీరు దాని ఎఫ్ హెచ్ ఐ స్కోర్ కు గణనీయంగా దోహదపడిందని నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు రెవెన్యూ మొబైల్ దేశంలో 75.2 స్కోర్‌తో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో, అప్పుల సూచీలో 8వ స్థానంలో నిలిచింది.