మన ఐటీ నడ్డి విరవనున్నఫెడ్ నిర్ణయం?
అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది
By: Tupaki Desk | 27 July 2023 11:18 AM GMTఅమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది అనేది ఓ మాట. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇది నిజమేనని ఎన్నోసార్లు తేలింది. ఈ సాంకేతిక కాలంలో మరింతగా రుజువవుతోంది. అమెరికా అంటేనే అగ్ర రాజ్యం. ఆర్థికంగా మహా శక్తి. ఏక ధ్రువ ప్రపంచంలో తిరుగులేని శక్తి. అలాంటి అమెరికా టెక్నాలజీ వచ్చాక మరింతగా బలపడింది. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఉద్యోగ అవకాశాలు, మెరుగైన జీవనం కోసం అమెరికా బాట పడుతుంటారు.
ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వాలు, బ్యాంకులు తీసుకునే నిర్ణయాలు మిగతా ప్రపంచంపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి. తాజాగా అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవాం 25 బేసిస్ పాయింట్లు పెంచి ఆశ్చర్యపర్చింది. దీంతో ఫెడ్ రేటు 5.50 శాతం వద్ద అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ తాజా వడ్డీ రేటు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠ స్థాయి ఇది. అంతేకాదు ద్రవ్యోల్బణంపై యుద్ధం సాగుతుందని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. ఫెడ్ రేట్ల పెంపు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. ఇది చాలా విభాగాలకు ప్రతికూలమని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందనేది నిపుణుల అంచనా.
అయితే, దీనివెనుక మరో కథనమూ ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందనే ఆందోళన కలుగుతోంది. వరుస వడ్డీ రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టవచ్చు. అదే జరిగి ఆర్థిక మందగమనం నెలకొంటుంది. అనేక భారతీయ ఐటీ సంస్థలకు దెబ్బే.
మింట్ నివేదిక ప్రకారం, అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా ఐటీ దిగ్గజాల ఫలితాలు బాగా దెబ్బ తిన్నాయి. 'బిగ్ ఫోర్' టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీల రెవెన్యూ గైడెన్స్‌లో భారీ కోత విధించు కోవడం గమనార్హం. యుఎస్ మాంద్యం సుదీర్ఘ దశలోకి జారిపోతే, అది అసంభవంగా కనిపిస్తోంటే, ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్టాలు మరింత తీవ్రమవుతాయని అని నిపుణులు భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణం దాటేందుకే..?
ఫెడ్ అనూహ్య నిర్ణయాల వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఇలా చేస్తున్నదంటూ విమర్శలు వస్తున్నయి. కాగా, తాజా పరిణామాలతో భారతీయ ఐటీ సంస్థలు మరింత నష్టపోతాయా? అంటే చాలా పరిమిత ప్రభావమనే వాదన వస్తోంది.
యూఎస్ ఫెడ్ రేట్ల పెంపునకు ముందే, భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు ఎగుమతి ఆదాయాలను డాలర్ రూపంలో పూర్ సింగిల్ డిజిట్‌లో పెంచుకోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. భారత ఐటీ ఎగుమతుల, హైబేస్ హై గ్రోత్‌కు కొనసాగించడం అనేది నిర్మాణాత్మక సమస్య. ఐటీ ఎగుమతులు రేట్ల పెంపుదలకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 0-0.25 శాతం శ్రేణి నుంచి దాదాపు 5 శాతానికి పెరిగే కాలంలో పెద్దగా తగ్గలేదు. కాబట్టి తదుపరి పెంపుదల ఏదైనా ఐటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండదని చెబుతున్నరు.
ఫెడ్ రేటు పెంపు రూపాయి మారక రేటును ప్రభావితం చేస్తుందని అదే పరిశ్రమ మార్జిన్ లను కొనసాగించడానికి సహాయపడుతుందని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో నిర్మాణాత్మక విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు మారే అవకాశం ఉంది. రెండేళ్లుగా డాలర్ పరంగా పేలవమైన (4-5 శాతం) వృద్ధి రేటు నమోదవుతుంది. మరింత గణనీయ రేటు పెంపుదల రూపాయి మారకపు రేటును మరింత బలహీన పరుస్తుంది. అమెరికా వడ్డీ రేట్లు ప్రస్తుతం రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణ కారణంగా, అక్కడి సంస్థలు అనివార్యంగా ఐటీ పెట్టుబడుల్లో కోత విధిస్తాయి. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తాయి. ఇది భారతీయ ఐటీ సంస్థల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు.