బెస్ట్ శాండ్ విచ్ గా నిలిచిన ఆహారమేంటో తెలుసా?
1960-70లలో దాదార్ రైల్వేస్టేషన్ సమీపంలో అశోక్ వైద్య అనే వీధి వ్యాపారి ఈ వంటకం తయారు చేసినట్లు తెలియజేసింది.
By: Tupaki Desk | 11 March 2024 9:12 AM GMTభారతీయులు ఆహార ప్రియులు. ఆహారం తీసుకోవడంలో మనవారిది ప్రత్యేక శైలి. పూర్వ కాలం నుంచి ఇప్పటి వరకు మన వంటకాలు ఎన్నో విశిష్టతలు సాధించాయి. మనం తినే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఆరోగ్య పరిరక్షణలో మనం తీసుకునే జాగ్రత్తలు బాగానే ఉంటాయి. మనదేశంలో మనం తీసుకునే ఆహారంలో రుచికరమైన పదార్థాలు ఉండటం సహజమే. సుగంధ ద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేసింది మనమే. అందుకే మన వంటల్లో వాటికి ప్రాధాన్యం ఇస్తుంటాం. దీంతో మన ఆహార అలవాట్ల గురించి అందరికి ఉత్సాహం ఉంటుంది.
ప్రపంచంలోనే మన వంటకాలకు ప్రాచుర్యం ఉంది. ఇండియన్ వంటకాలు అంటే నోరూరుంచేలా ఉంటాయని నమ్మడం కామనే. ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకంగా మన భారతీయ వంటకం వడ పావుకు మంచి భారతీయ స్ట్రీట్ ఫుడ్ గా చోటు దక్కించుకోవడం విశేషం. టాప్ 20 బెస్ట్ శాండ్ విచ్ లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలవడం గమనార్హం. ప్రముఖ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్ విచ్ ల జాబితాను విడుదల చేసింది. అందులో దీనికి 19వ స్థానం లభించడం గర్వకారణం.
టేస్ట్ అట్లాస్ నివేదిక ప్రకారం వడాపావు ముంబయిలోని ఓ వీధిలో తయారయిన వంటకం. 1960-70లలో దాదార్ రైల్వేస్టేషన్ సమీపంలో అశోక్ వైద్య అనే వీధి వ్యాపారి ఈ వంటకం తయారు చేసినట్లు తెలియజేసింది. అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చే క్రమంలో వడపావు కీలక పాత్ర పోషించింది. త్వరగా జీర్ణమయ్యే దీన్ని తినడానికి అందరు ఇష్టపడ్డారు. దీంతో వడపావుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది.
ప్రస్తుతం అమెరికా లాంటి దేశంలో కూడా వడపావు మంచి రుచికరమైన వంటకంగా నిలిచింది. ప్రముఖ రెస్టారెంట్లలో రుచికరమైన తిండిగా పేరు తెచ్చుకుంది. థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరు తిళ్లు అగ్రస్థానంలో నిలిచాయి. సామాజిక మాధ్యమాల్లో వీటిని షేర్ చేస్తున్నారు. టేస్టీ అట్లాస్ విడుదల చేసిన జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచింది. ఇలా మన వంటకాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మన వంటకాల్లో ఉండే రుచికరమైన పదార్థాలతోనే మన వాటిని ఇష్టంగా తింటున్నారు.
మనదేశంలో ముంబయిలో వడపావు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. దీంతో ఈ వంటకం అందరికి ఇష్టమైన వంటకంగా మారింది. ప్రపంచంలోనే ఎక్కువమంది తినే ఆహార పదార్థాల్లో దీనికి విలువ ఏర్పడింది. మంచి సరసమైన ధరకు లభించే ఇందులో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. అందుకే దీన్ని తీసుకుని ఆకలి తీర్చుకోవడం మామూలే. ఇలా వడపావు అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్థంగా నిలుస్తోంది.