రైస్ బాల్ అంటే ఏంటి? జపాన్ లో దీనికి డిమాండ్ ఎందుకు ఎక్కువ
రైస్ బాల్స్ తయారీ విధానంపై రచ్చరచ్చగా మారుతోంది. దీని తయారుపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి
By: Tupaki Desk | 3 May 2024 4:30 PM GMTఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. జపాన్ లో రెస్టారెంట్లు, శతాబ్దాల చరిత్ర గల పురాతన వంటకాల వాడకంలో రైస్ బాల్ ప్రాధాన్యత ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. నోరూరించే వంటకాలు తినడంలో జపానీయుల శైలే వేరు. వారు మంచి ఆహార ప్రియులు. వారికి నచ్చితే ఏదైనా ఇష్టంగా తింటారు. అలా వారి ఆహార అలవాట్లలో వెరైటీ ఉండేలా చూసుకుంటారు.
జపాన్ లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ప్రసిద్ధి చెందింది. వివిధ రకాల కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్రపు పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డుల్లా చుడతారు. వాటిని అందమైన మహిళా చెఫ్ లను రెస్టారెంట్లు రంగంలోకి దించుతాయి. వారు వాటిని చేతికి బదులు చంక కింద పెట్టుకుని చుడతారు.
వీటి ధరలో తేడాలుంటాయి. కొన్ని రెస్టారెంట్లు వీటిని 10 రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముతుంటారు. ఒనిగిరి ముద్దలను గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రైస్ బాల్స్ తయారీ విధానంపై రచ్చరచ్చగా మారుతోంది. దీని తయారుపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగెటివ్ గా పెడుతున్నారు.
వీటిని కొందరు ఇష్టంగా తింటుంటే మరికొందరు మాత్రం రుచిగా లేవని మొగ్గు చూపడం లేదు. కొందరైతే రైస్ బాల్స్ అంటే ప్రాణం. కానీ అత్యంత జుగుస్సాకరంగా ఉందని మండిపడుతున్నారు. ఈ డిష్ ను ట్రై చేయమని చెబుతున్నారు. దక్షిణ చైనాలో కూడా వీటికి భలే గిరాకీ ఉంటుంది. చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ ఉంటుందని దీంతో లైంగిక ప్రేరేపణలు బాగుంటాయని చెబుతున్నారు.
రైస్ బాల్స్ గురించి ఎవరికి తోచిన విధంగా వాళ్లు చెబుతున్నారు. కొందరికేమో ఇష్టంగా మరికొందరికేమో కష్టంగా ఉందంటున్నారు. చంకలో తయారు చేయడం వల్ల వాటి వాసన బాగుండదని అంటుంటే అక్కడ తయారు చేయడం వల్లే వాటికి అంతటి ప్రాధాన్యం ఉందని అంటున్నారు. మొత్తానికి రైస్ బాల్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. జపాన్ వంటకాల్లో మంట పెడుతున్నాయి.