Begin typing your search above and press return to search.

60 సెకన్లకు 34 బిర్యానీలు.. హైదరాబాదీయుల ఆర్డర్లపై స్విగ్గీ!

హైదరాబాదీయుల ఫుడ్ అలవాట్లు.. ట్రెండ్స్ కు సంబంధించి స్విగ్గీ ఆసక్తికర రిపోర్టును విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   25 Dec 2024 5:33 AM GMT
60 సెకన్లకు 34 బిర్యానీలు.. హైదరాబాదీయుల ఆర్డర్లపై స్విగ్గీ!
X

హైదరాబాదీయుల ఫుడ్ అలవాట్లు.. ట్రెండ్స్ కు సంబంధించి స్విగ్గీ ఆసక్తికర రిపోర్టును విడుదల చేసింది. ప్రతి ఏడాది చవర్లో.. ఆ ఏడాదికి సంబంధించి ఫుడ్ ట్రెండ్స్.. తన కస్టమర్ల ఆర్డర్లు ఏ రీతిలో సాగాయన్న విషయాన్ని తెలిపేలా వెల్లడించటం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన ట్రెండ్స్ ను చూస్తే.. ఏడాది మొత్తంలో ప్రతి నిమిషానికి 34 చొప్పున బిర్యానీలను తమ వద్ద వినియోగదారులు ఆర్డర్ చేసినట్లుగా పేర్కొంది.

హైదరాబాదీయుల ఫేవరెట్ ఫుడ్ గా బిర్యానీగా తేల్చింది. ఉదయాన్నే దోశెను ఎక్కువగా ఆర్డర్ చేస్తారని.. రాత్రిళ్లు బిర్యానీలు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు.. ఏడాది మొత్తంగా స్విగ్గీ ద్వారా హైదరాబాదీయులు 1.57 కోట్ల బిర్యానీలను బుక్ చేసినట్లుగా వెల్లడించింది. ఒక్క స్విగ్గీ ఆర్డర్లే ఇంతలా ఉంటే.. మిగిలిన డెలివరీ యాప్ లు.. హోటళ్లు.. రెస్టారెంట్ల హోం డెలివరీలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.

ఇవే కాకుండా.. రెస్టారెంట్లు.. వేడుకల్లో వడ్డించే బిర్యాలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత భారీగా ఉండటం ఖాయం. స్విగ్గీ అంచనా ప్రకారం క్రికెట్ చూస్తూ బిర్యానీ తింటే ఆ మజానే వేరని.. టీ20 ప్రపంచ కప్ సందర్భంగా 8.69 లక్షల బిర్యాలను హైదరాబాదీయులు ఆర్డర్లు చేశారని వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి 2024లో 60 బిర్యానీల కోసం ఏకంగా రూ.18,840 ఖర్చు చేసినట్లుగా వెల్లడించింది. బిర్యానీని తెల్లవారుజామున నాలుగు గంటల వేళలోనూ ఆర్డర్లు ఇస్తున్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఉదయం వేళలో దోశెల్ని ఎక్కువగా ఆర్డర్లు ఇస్తున్నట్లుగా పేర్కొన్న స్విగ్గీ.. దోశెల ఆర్డర్లు దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

టీ20 సమయంలో హైదరాబాద్ లో అత్యధికంగా 8.69 లక్షల చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారని.. దాని తర్వాత పిజ్జాలను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లుగా పేర్కొంది. బిర్యానీలో తొలి స్థానం చికెన్ బిర్యానీదని.. దీంతో పాటు పన్నీర్.. రొయ్యల.. ఎగ్.. మష్ రూం.. ఇలా అన్ని రకాల బిర్యానీలను హైదరాబాదీయులు ఆదరిస్తారని పేర్కొంది. ఇక.. హైదరాబాదీయుల అభిమాన స్వీట్ డబుల్ కా మీటాగా పేర్కొన్న స్విగ్గీ.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 21 లక్షల ఆర్డర్లు తమకు అందినట్లుగా పేర్కొంది. మదర్స్ డే సందర్భంగా మాత్రం నిమిషానికి ఐదు కేకులు చొప్పున ఆర్డర్లు తమకు అందినట్లుగా స్విగ్గీ పేర్కొంది.