నెలలో10 లక్షల బిర్యానీలు.. 5 లక్షల హలీమ్ ఆర్డర్లు!
దేశ వ్యాప్తంగా 6 మిలియన్లు (60 లక్షలు) బిర్యానీ ప్లేట్లు ఆర్డర్లు రాగా.. అందులో పది లక్షల ప్లేట్లు ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే ఆర్డర్లురావటం గమనార్హం.
By: Tupaki Desk | 11 April 2024 4:40 AM GMTఉపవాస మాసంగా పేర్కొనే రంజాన్ మాసంలో హైదరాబాదీయులు అస్సలు తగ్గలేదు. కేవలం నెల వ్యవధిలో బిర్యానీలు.. హలీమ్ లకు ఆన్ లైన్ లో భారీగా ఆర్డర్లు వెల్లువెత్తినట్లుగా ప్రముఖ ఆన్ లైన్ డెలివరీ సంస్థ స్విగ్గీ పేర్కొంది. రంజాబ్ మాసంలో భారీ ఎత్తున ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లుగా పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా విడుదల చేసింది.
హైదరబాద్ మహానగరంలో నెల వ్యవధిలో 10 లక్షల బిర్యానీలను.. 5.3 లక్షల హలీమ్ ల ఆర్డర్లు తమకు రాగా.. వాటిని డెలివరీ చేసినట్లుగా పేర్కొంది. దేశ వ్యాప్తంగా 6 మిలియన్లు (60 లక్షలు) బిర్యానీ ప్లేట్లు ఆర్డర్లు రాగా.. అందులో పది లక్షల ప్లేట్లు ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే ఆర్డర్లురావటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్డర్లు జోరు 15 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
హైదరాబాద్.. కోల్ కతా.. లక్నో.. .భోపాల్.. మీరట్ నగరాల్లో వినియోగదారుల ఆర్డర్లు పరిశీలించగా.. ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగినట్లుగా వెల్లడించింది. హలీమ్ కొనుగోళ్లలోనూ భారీ ఎత్తున పెరిగినట్లుగా పేర్కొంది.
హాలీమ్ కొనుగోళ్లు 145 శాతం పెరిగితే.. ఫిర్నీ 80 శాతం.. మూల్పువా 79 శాతం.. ఖర్జురాలు 48 శాతం పెరిగినట్లుగా వెల్లడించింది. మొత్తానికి రంజాన్ మాసం మొత్తం ఆన్ లైన్ ఆర్డర్లు అదరగొట్టాయని చెప్పాలి. ఆఫ్ లైన్ లోనూ బిర్యానీలు.. హలీమ్ బిజినెస్ హైదరాబాద్ లో భారీగా జరిగినట్లుగా వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి.