Begin typing your search above and press return to search.

సింగ‌పూర్‌లో భారతీయ మ‌సాలా బ్రాండ్ల నిషేధం?

ఇథిలీన్ ఆక్సైడ్‌తో భారతీయ మసాలా దినుసులలో క్యాన్సర్ కారక రసాయనాలను క‌నుగొన్నారు.

By:  Tupaki Desk   |   27 April 2024 3:57 AM GMT
సింగ‌పూర్‌లో భారతీయ మ‌సాలా బ్రాండ్ల నిషేధం?
X

భారతీయ మసాలా బ్రాండ్లలో క్యాన్సర్ కారక రసాయనాలను అంతర్జాతీయ ఏజెన్సీ కనుగొంది. హాంకాంగ్ కి చెందిన‌ CFS నివేదిక భార‌తీయ మ‌సాలాల్లో విష‌ర‌సాయ‌నాలు గుర్తించామ‌ని ప్ర‌క‌టించింది. ఇథిలీన్ ఆక్సైడ్‌తో భారతీయ మసాలా దినుసులలో క్యాన్సర్ కారక రసాయనాలను క‌నుగొన్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఇథిలీన్ ఆక్సైడ్‌ను గ్రూప్-1 కార్సినోజెన్‌గా వర్గీకరించింది. మనకి సంబంధించిన రెండు కంపెనీ మ‌సాలా ప్యాకెట్ల‌ నుండి ప్రభావితమైన ఉత్పత్తులకు సింగపూర్ నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది.

ఇటీవల హాంకాంగ్ ఆహార నియంత్రణ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించిన‌ ఒక నివేదిక ప్ర‌కారం.. సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (CFS) ఏప్రిల్ 5వ తేదీన భారతదేశంలోని మూడు మసాలా ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్రిమిసంహారక రసాయనాలను కలిగి ఉన్న క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ షాకింగ్ రిపోర్ట్ వివ‌రాల్లోకి వెళితే.. హాంకాంగ్ - సింగపూర్‌లోని ఫుడ్ రెగ్యులేటర్లు ఏప్రిల్ మొదటి వారంలో ఒక నివేదికను విడుదల చేశారు. క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలైన ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నందున భారతదేశం నుండి మసాలా ఉత్పత్తులను ఆహారంలో తీసుకోవ‌ద్ద‌ని త‌మ‌ ప్రజలను ప్ర‌భుత్వాలు హెచ్చరించాయి.. సుగంధ ద్రవ్యాల జాబితాలో రెండు పెద్ద మసాలా ఉత్పత్తులు ఉన్నాయి. భారతీయ కంపెనీలు మ‌సాలా ప్యాకెట్ల‌లో రసాయనాలు పరిమితిని మించిపోయాయి. అయితే ఈ నివేదికపై కంపెనీలు ఇంత‌వ‌ర‌కూ స్పందించలేదు.

CFS హాంకాంగ్‌లోని మూడు రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి ఉత్పత్తులను తీసుకుని ప‌రీక్షించింది. పరీక్ష ఫలితాలు శాంపిల్స్‌లో పురుగుమందు, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు తేలిందని CFS ప్రతినిధి చెప్పారు. అనంత‌రం రెగ్యులేటర్ విక్రేతలను ``విక్రయాలను ఆపివేయాలని .. ప్రభావిత ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమ``ని సూచించినట్లు తెలుస్తోంది. ఆహార నియంత్రణలో పురుగుమందుల అవశేషాలు (క్యాప్. 132CM) చ‌ట్టం ప్రకారం.. ప్ర‌జారోగ్యానికి హానికరం కానట్లయితే మాత్రమే మ‌సాలాప్యాకెట్ల‌ను విక్రయించవచ్చు. కానీ ప్ర‌స్తుత మ‌సాలాలు క్యాన్స‌ర్ కార‌క అవ‌శేషాల‌ను క‌లిగి ఉన్నాయి. ఈ చ‌ట్టంలో నేరస్థుడికి గరిష్టంగా $50,000 జరిమానా .. ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది అని CFS ప్రతినిధి తెలిపారు.

ఏప్రిల్ 18న ఉత్పత్తుల స‌ర‌ఫ‌రాను ఆపేయాల‌ని ఆదేశించింది. ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగానికి తగినది కాదని SFA పేర్కొంది. దీనిని సూక్ష్మజీవుల కలుషితాన్ని నివారించడానికి వ్యవసాయ ఉత్పత్తులకు పొగ వేసేందుకు ఉపయోగిస్తారు.. అయినప్పటికీ సింగపూర్ ఆహార నిబంధనల ప్రకారం.. ఇథిలీన్ ఆక్సైడ్‌ను సుగంధ ద్రవ్యాల స్టెరిలైజేషన్‌లో ఉపయోగించవచ్చు. తక్కువ స్థాయి ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ప్రమాదం లేదని కూడా పేర్కొన్నారు. కానీ ఈ పురుగుమందు క్యాన్సర్ కారక లక్షణాలు దీర్ఘకాలిక వినియోగంపై క్యాన్సర్ కణాలను ప్రేరేపించవచ్చు .. దీర్ఘకాలంలో ఆరోగ్య ప్రమాదాలకు దారితీయవచ్చు.