Begin typing your search above and press return to search.

స్విగ్గీ రిపోర్టు: ఏడాదిలో ఆ ఇద్దరు ఇడ్లీలు.. బిర్యానీల కోసం అంత ఖర్చు!

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. తన వార్షిక రిపోర్టును తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలకు కొదవ లేదు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 4:37 AM GMT
స్విగ్గీ రిపోర్టు: ఏడాదిలో ఆ ఇద్దరు ఇడ్లీలు.. బిర్యానీల కోసం అంత ఖర్చు!
X

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. తన వార్షిక రిపోర్టును తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలకు కొదవ లేదు. గత ఏడాది మాదిరే.. ఈ ఏడాది కూడా ఇద్దరు కస్టమర్లు ప్రత్యేకంగా నిలిచారు. వీరికి సంబంధించినవివరాలు బయటపెట్టటం లేదు కానీ.. సదరు వ్యక్తి చేసిన ఖర్చు లెక్క చూస్తే..కళ్లు చెదిరిపోవాల్సిందే. ఏడాది మొత్తంలో ఇడ్లీల కోసం ఒక వినియోగదారు పెట్టిన ఆర్డర్ అక్షరాల రూ.6లక్షలుగా గుర్తించారు. సదరు వ్యక్తి వివరాల్ని బయటపెట్టలేదు.

ఇక.. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అయితే.. ఇతని వివరాల్ని కూడా స్విగ్గీ వెల్లడించలేదు. ఈ వ్యక్తి రోజుకు నాలుగు బిర్యానీలకు పైనే ఆర్డర్ చేసినట్లుగా వెల్లడించారు. ఇక.. దేశ వ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచి వస్తుందని స్విగ్గీ వెల్లడించింది. హైదరాబాద్ మహా నగరంలో కూకట్ పల్లి వాసులు ఎక్కువగా బిర్యానీ రుచుల్ని అస్వాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తర్వాతిస్థానంలో మాదాపూర్.. బంజారాహిల్స్.. గచ్చిబౌలి వాసులు ఉన్నారు. కాంబో బిర్యానీల ఆర్డర్లలో అగ్రస్థానం కుకట్ పల్లిదే.

డిసౌంట్ల ఆర్డర్లను అందిపుచ్చుకోవటంలోనూ హైదరాబాదీయులే ముందున్నారు. ఒక ఐటీ ఉద్యోగి ఏడాది కాలంలో రూ.5.58 లక్షల్ని ఆదా చేశాడు. తర్వాతి స్థానంలో ఢిల్లీకి చెందిన వినియోగదారు రూ.3లక్షల వరకుసేవ్ చేసినట్లుగా పేర్కొన్నారు. చెన్నై.. ఢిల్లీ.. హైదరాబాద్ నగరాల్లో కొంతమంది 10వేలకంటే ఎక్కువ ఆర్డర్లు ఇవ్వటం గమనార్హం. దేశ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు రాగా.. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒకటి వెజ్ బిర్యానీ కావటం గమనార్హం.

ఈ ఏడాదిలో 20.49 లక్షలమంది యూజర్లు స్విగ్గీలో కొత్తగా బిర్యానీలు ఆర్డర్ బుక్ చేసినట్ులగా పేర్కొంది. ఇక.. చంఢీగఢ్ కు చెందిన ఒక కుటుంబం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అక్టోబరులో భారత్ - పాక్ మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలను ఆర్డర్ చేశారని తెలిపింది.

భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను తాము డెలివరీ చేశామని.. తమ డెలివరీ పార్టనర్స్ గత ఏడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర ఎలక్ట్రికల్ వెహికిల్స్.. సైకిళ్లపై ప్రయాణించి డెలివరీలు ఇచ్చినట్లుగా తెలిపింది. చెన్నైకు చెందిన వెంకటేశన్ అనే వ్యక్తి అత్యధికంగా ఏడాదిలో 10,360.. కొచ్చికి చెందిన సంథిని 6,253 డెలివర్లు చేసినట్లుగా పేర్కొంది.

జైపూర్ కు చెందిన ఒక వినియోగదారుడు రోజులో 67 ఉత్పత్తుల్ని ఆర్డర్ చేసినట్లుగా పేర్కొన్న స్విగ్గీ.. చెన్నైకు చెందిన మరో వ్యక్తి.. కాఫీ.. జ్యూస్.. బిస్కెట్లు.. చిప్స్ కోసం ఒక్క ఆర్డర్ లో అత్యధికంగా రూ.31,748 ఖర్చు చేశాడు. అదే విధంగా భువనేశ్వర్ కు చెందిన ఒక కస్టమర్ రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశాడని.. ముంబయికి చెందిన ఒక కస్టమరర్ ఏడాదిలో రూ.42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడని తెలిపింది.

యూపీలోని ఝూన్సీలో జరిగిన ఒక పెద్ద పార్టీలో ఏకంగా 269ఐటెమ్స్.. దుర్గా పూజ సందర్భంగా దేశ వ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చినట్లుగా తెలిపింది. నవరాత్రి రోజుల్లో చాలామంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశగా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక కస్టమర్ కు కేవలం 65 సెకన్ల వ్యవధిలో నూడుల్స్ ప్యాకెట్ ను డెలివరీ చేసిన వైనాన్ని వెల్లడించారు. హైదరాబాద్.. ముంబయి కంటే కూడా బెంగళూరు నుంచి మామిడిపండ్లకు భారీగా ఆర్డర్లు వచ్చినట్లుగా సంస్థ పేర్కొంది.

గార్డెన్ సిటీగా పేర్కొనే బెంగలూరు కేక్ సిటీగా మారింది. ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయని.. వాలంటైన్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డ్స్ వచ్చినట్లుగా పేర్కొన్నారు. నాగపూర్ కు చెందిన ఒక కస్టమర్.. రోజులో 92 కేక్స్ ను ఆర్డర్ చేయటం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే 2023లో వెజిటేరియన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగినట్లుగా పేర్కొన్ానరు.