తెలంగాణలో వయోనైస్ పై నిషేధం... ఇదే కారణం!
ఇటీవల "పానీపూరీ" విషయంలో కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Oct 2024 4:54 AM GMTఇటీవల "పానీపూరీ" విషయంలో కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పదార్థాన్ని సుమారు 200 చోట్ల శాంపుల్స్ తీసి పరీక్షలకు పంపింది! ఇదే క్రమంలో... తాజాగా ఫుడ్ సేఫ్టీ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మయోనైస్ పై నిషేధం విధించాలని నిర్ణయించింది.
అవును... తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్ పై నిషేధం విధించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామొదర్ రాజనర్సింహం ఈ మేరకు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అంతకముందు ఆయన ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కల్తీ ఆహారం తీసుకొని ప్రజలు అనారోగ్యం పాలవుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ మయోనైస్ ను ఎక్కువగా మండి బిర్యానీ, కబాబ్, బర్గర్, శాండ్ విచ్, పిజ్జా తో పాటు పలు ఆహార పదార్ధాల్లో వినియోగిస్తారు. మరికొంతమంది చట్నీలా వేసుకుని తింటారు.
కాగా.. బంజారాహిల్స్ లోని పలు కాలనీలలో గత శుక్రవారం ఓ దుకాణంలో విక్రయించిన మాంసాహార మోమోస్ తో పాటు ఇచ్చిన వయోనైస్ ని తిన్న ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే! ఇదే సమయంలో ఆమె పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. అల్వాల్ లోని ఓ హోటల్ లోనూ నాసిరకం మయోనైస్ ను తిన్న కొంతమంది యువకులు ఆస్పత్రి పాలయ్యారు!
దీంతో ఈ వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టిసారించిందని చెబుతున్నారు. ఇటీవల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని ప్రముఖ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల్లో జరిపిన తనిఖీల్లోనూ నాసిరకం వయోనైస్ ను గుర్తించారు. ఈ మయోనైస్ ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారుచేస్తారని చెబుతున్నారు!
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో పచ్చి గుడ్లను ఉపయోగించి చేసే మయోనైస్ తయారీని ఒక ఏడాది పాటు నిషేధించారు! ఈ మేరకు ఈ నిషేధం అక్టోబర్ 30 నుంచే అమలులోకి వచ్చింది!