Begin typing your search above and press return to search.

కొత్త ట్రెండ్ : భారత్ లో పెరుగుతున్న వెజిటేరియన్లు

ఇటీవల కాలంలో చూస్తే హైదరాబాద్ నుంచి చూస్తే ముంబై బెంగళూరు, పూణె, గోవా వంటి చోట్ల పెద్ద ఎత్తున వెజ్ రెస్టారెంట్లు ఏర్పాటు అవుతున్నాయని గుర్తు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Jan 2025 4:10 AM GMT
కొత్త ట్రెండ్ : భారత్ లో పెరుగుతున్న వెజిటేరియన్లు
X

శాకాహారం తీసుకునే వారిని ఒకపుడు చులకనగా చూసే వారు ఆకుకూరలు కందమూలాలు తిని బతికే వారు అని వేళాకోళం చేసేవారు. అయితే మారిన జీవన శైలి తెస్తున్న ముప్పులతో పాటు వింత జబ్బులకు జడిసిన జనాలు ఇప్పుడు అసలైన ఔషద గుణం వెజిటేరియన్ ఫుడ్ లోనే ఉందని భావిస్తున్నారు దాంతో ప్రపంచవ్యాప్తంగా వెజ్ ఫుడ్ ని తీసుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇదొక కొత్త ట్రెండ్ అని అంటున్నారు.

వైద్య నిపుణులతో పాటు ఆహార నిపుణులు కూడా బెస్ట్ ఫుడ్ గా వెజ్ నే సూచిస్తున్నారు. వెజ్ తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుందని అదే సమయంలో చాలా జబ్బుల నుంచి తప్పించుకోవచ్చునని చెబుతున్నారు. ఈ పరిణామంతో చాలా మంది పక్కా నాన్ వెజ్ ప్రియులు కూడా ఇపుడు వెజ్ ఫుడ్ వైపు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ వైపుగా మళ్ళుతున్నారు.

ఇక భారత్ లో చూస్తే శాకాహారం తినే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని కొన్ని రకాలైన అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. భారత దేశంలో ఏకంగా 23 నుంచి 37 శాతం దాకా వెజిటేరియన్లు ఉన్నారని పలు సర్వేలు తెలియచేస్తునాయి.అంటే ప్రతీ ముగ్గురిలో ఒకరు వెజిటేరియన్ అన్న మాట.

దేశంలో శాకాహా రులు ఎక్కువగా ఉన్నది మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో అని అధ్యయనాలలో వెల్లడి అయింది. ఒకపుడు భారత్ నిండా వెజిటేరియన్లు ఉండేవారు. దానికి కారణం భక్తి విశ్వాసాలు పూజలు ఆచారాలు అన్నీ కలసి భారత్ ని ప్రపంచానికి అతి పెద్ద వెజ్ కాపిటల్ గా మార్చాయి.

అయితే ఆ తరువాత మారిన ప్రపంచ నేపధ్యాన్ని అందిపుచ్చుకుని వికసించిన చైతన్యంతో భారత్ లో కూడా నాన్ వెజ్ ప్రియులు అధికం అయ్యారు. దాంతో వరల్డ్ వెజ్ కాపిటల్ గా భారత్ కి ఉన్న పేరు తరువాత కాలంలో పోయింది. అయితే మళ్లీ ఇపుడు భారత్ లో వెజ్ ట్రెండ్ పెరుతోంది అంటున్నారు. అమెరికాకు చెందిన బాలమురళీ నటరాజ్ అలాగే ఇండియాకు చెందిన సూరజ్ జాకబ్ నిర్వహించిన ఒక సర్వేలో శాకాహారుల సంఖ్య నానాటికి అధికం అవుతోంది అని వెల్లడి అయింది.

ఇటీవల కాలంలో చూస్తే హైదరాబాద్ నుంచి చూస్తే ముంబై బెంగళూరు, పూణె, గోవా వంటి చోట్ల పెద్ద ఎత్తున వెజ్ రెస్టారెంట్లు ఏర్పాటు అవుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక చిన్న స్థాయి పట్టణాలలో వెజ్ హొటళ్ళు ఇటీవల కాలంలో బాగా పెరిగాయని అంటున్నారు.

భారత్ లో శాకాహారుల పెరుగుదల వెనక ఆరోగ్యంతో పాటు ఆధ్యాంతిక భావాలు కూడా మిళితం అయి ఉన్నాయని అంటున్నారు. అలాగే ఆకు కూరలను ఎక్కువగా వినియోగించడం దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తినదని వైద్యులు ఇచ్చే సూచనలతో కూడా అత్యధికులు ఈ వైపుగా వస్తున్నారు అని అంటున్నారు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా వెజ్ ఫుడ్ ని ఇష్టపడుతూ తాము శాకాహారులుగా మారామని ఇస్తున్న సందేశం కూడా ప్రజలకు ఆకట్టుకుంటోంది అంటున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ చెత్రీ బాలీవుడ్ టాప్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, అనుష్క షర్మ అలియా భట్ మైలికా అరోరా, భూమి ఫడ్నేకర్ వంటి వారు శాకాహారం ఉత్తమమైనది అని చెబుతున్నారు.

ఆ ప్రభావం కూడా జనాల మీద పడుతోంది. దీంతో దేశంలో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ కూడా ఇటీవల కాలంలో అనేక రెట్లు పెరిగింది అని అంటున్నారు. ఈ పరిణామాలతో భారత్ మళ్లీ ప్రపంచానికి వెజ్ కాపిటల్ గా అవతరించడానికి అట్టే సమయం పట్టదని అంటున్నారు.