ప్రపంచంలో అత్యధికంగా తినే పండ్లు ఏంటో తెలుసా..!
దేశాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. మన దేశంలో ఎక్కువ శాతం రైస్, గోధుమలు తింటారు.
By: Tupaki Desk | 10 Jan 2025 10:30 PM GMTదేశాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. మన దేశంలో ఎక్కువ శాతం రైస్, గోధుమలు తింటారు. కొన్ని దేశాల్లో బర్గర్ పిజ్జాలు తింటారు. మరికొన్ని దేశాల్లో నూడుల్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్ రకాలు తింటారు. అలాగే పండ్లను కూడా వారికి లభించిన పండ్ల రకాలను బట్టి తింటారు. ప్రాంతాలను బట్టి పండ్ల తోటల సాగు ఉంటుంది. ఎక్కువగా ఏ పండ్లు లభిస్తే అక్కడ ఆ పండ్లను ఎక్కువగా తినడం మనం చూస్తూ ఉంటాం. సీజన్‌లో వచ్చే పండ్లను తింటూ ఉంటారు. అయితే అన్ని సీజన్‌లలో, అన్ని దేశాల్లో ఉండే పండ్లు కొన్ని ఉంటాయి. అందులో అరటి పండ్లు ముందు ఉంటాయి.
అరటి పండ్లు తినే దేశాలు చాలా ఉంటాయి. ప్రతి దేశంలోనూ అరటి పండ్లు తినే వారు అత్యధికులు ఉంటారు. తక్కువ రేటు కావడంతో పాటు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. అందుకే అరటి పండ్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే వారు ఉంటారు. ముఖ్యంగా అరటి పండ్లను పిల్లలు తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇండియాలో అరటి పండ్ల రేట్లు ఇతర పండ్లతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. ఆహారం లేని వారు అరటి పండు తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అతి తక్కువ రేటుతో కడుపు నింపే ఆహారంగా అరటి పండ్లు నిలుస్తాయి.
అరటి పండ్లలో ఉండే పోషకాలతో పాటు పలు ఆరోగ్యకరమైన విటమిన్‌లు ఉంటాయి. అందుకే వైద్యులు యాపిల్‌తో పాటు అరటి పండ్లను తినమని సలహా ఇస్తారు. ఎక్కువ శాతం మంది యాపిల్ కొనలేని వారు అరటి పండ్లను తింటారు. అరటి పండ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. ఒక అంతర్జాతీయ హెల్త్ సంస్థ సర్వే ప్రకారం ఒక ఏడాదిలో 10 వేల కోట్ల అరటి పండ్లను ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు. అరటి పండ్లను డైరెక్ట్‌గా తినడం మాత్రమే కాకుండా వివిధ రకాలుగా దాన్ని వినియోగించే వారు ఉన్నారు.
కొందరు అరటితో కూర చేస్తారు, కొందరు అరటి పండ్లతో జ్యూస్ చేస్తారు, మరి కొందరు అరటి పండ్ల సలాడ్ చేస్తారు. మన పక్క రాష్ట్రం కేరళలో అత్యధికులు అరటి కాయ బజ్జీలు తింటారు. అందుకే అరటికి బాగా డిమాండ్ ఉంది. ఇండియాలో అరటి తోటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. విదేశాల్లోనూ అరటి సాగు ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అరటి తినే వారు ఉన్నంతగా మరే పండ్లు తినే వారు లేరు అనేది ఆ సంస్థ సర్వే లెక్కల సారాంశం. ఇండియాలో అత్యధికంగా అరటి పండ్లను తింటారు.