Begin typing your search above and press return to search.

వామ్మో.. కిలో బియ్యం రూ.15వేలా..! వాటిని ఎక్కడ పండిస్తున్నారంటే..!

మన దేశంలో వరి ప్రధాన పంట. వరిని పండించే రాష్ట్రాలు చాలా వరకు ఉన్నాయి. వివిధ దేశాల్లోనూ ఈ వరిపంట సాగవుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 7:30 AM GMT
వామ్మో.. కిలో బియ్యం రూ.15వేలా..! వాటిని ఎక్కడ పండిస్తున్నారంటే..!
X

మన దేశంలో వరి ప్రధాన పంట. వరిని పండించే రాష్ట్రాలు చాలా వరకు ఉన్నాయి. వివిధ దేశాల్లోనూ ఈ వరిపంట సాగవుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్నమే ఎక్కువగా తింటుంటారు. అయితే.. ఏటా వరిలో రకరకాల వంగడాలు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇప్పటికే వరిలో చాలా వంగడాలు ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల కోసం వారి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే.. మార్కెట్లోకి వెళ్తే రకరకాల బియ్యం చూస్తుంటాం. సన్న, దొడ్డు రకాలు, బాస్మతి అంటూ ఇప్పటికే రకరకాల బియ్యం లభిస్తున్నాయి.

ఎక్కువగా మనం తెల్ల బియ్యాన్ని వాడుతుంటాం. అయితే.. మార్కెట్లలో లభిస్తున్న బియ్యం ధర 60 నుంచి 70.. చివరకు కిలో 150 వరకు ధర ఉంటుంది. రకాన్ని బట్టి నాణ్యత, రకాన్ని బట్టి రుచి, వాసన కలిగి ఉంటాయి. అలాగే.. పోషకాలూ మనం పెట్టే ధరను బట్టి ఉంటాయి. వాటి క్వాలిటీని బట్టి మార్కెట్లో అమ్ముతుంటారు. అయితే.. కిలో బియ్యం ధర రూ.15వేలు ఉంటుందని ఎప్పుడైనా విన్నారా..? అవును.. మీరు చదివింది నిజమే.. ఆ బియ్యం ఒక కిలో ధర రూ.15వేలు. ఇంతకీ ఆ బియ్యం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

ఈ బియ్యం జపనీయులు సాగు చేస్తున్నారు. జపనీస్ కిన్మెమై రైస్ పేరిట వీటిని పండిస్తున్నారు. ఈ బియ్యం కిలో ధర రూ.15వేలకు విక్రయిస్తున్నారు. పేటెంట్ పొందిన కిన్మెమై పద్ధతిని వినియోగించి వీటిని పండిస్తారు. ఇంత ధర పెట్టి కొన్న బియ్యంలో పోషకాలూ అదే స్థాయిలో ఉంటాయట. రుచికూడా చాలా బాగుంటుందని జపనీయులు చెబుతున్నారు. అలాగే.. వీటితో ఏదేని ఆహార పదార్థాలను తయారుచేసి తింటే ఆహారం కూడా బాగుంటుందని అంటున్నారు.

జపాన్ ఈ బియ్యం ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తుండగా.. వీటి ధర విన్న ప్రజలు మాత్రం.. ఈ బియ్యం తినాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పేదలు కనీసం బయట బియ్యం కొనలేక.. రేషన్ బియ్యం పైనే ఆధారపడి బతుకుతున్నారు. రూ.15వేలకు కిలో ధర విన్నాక ఒకింత ఆశ్యర్యానికి గురవుతున్నారు.