Begin typing your search above and press return to search.

యాపిల్ కూడా మడతపెడుతుందంట... తెరపైకి ఫోల్డబుల్ ఐఫోన్!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్ వేగంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 July 2024 3:52 PM GMT
యాపిల్ కూడా మడతపెడుతుందంట... తెరపైకి ఫోల్డబుల్ ఐఫోన్!
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్ వేగంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శాంసంగ్, వన్ ప్లస్, వివో కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్స్ ని మార్కెట్ లోకి విడుదల చేసి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో... ఐఫోన్ తో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న యాపిల్ ఈ విషయంలో కాస్త వెనుకబడినట్లు కథనాలొస్తున్నాయి.

దీంతో... యాపిల్ కంపెనీ తన సొంత ఫోల్డబుల్ ఐఫోన్ ను ఎప్పుడు తీసుకువస్తుందనే చర్చ ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే... అందుతున్న నివేదికల ప్రకారం... యాపిల్ అభిమానులు ఫోల్డబుల్ ఐఫోన్ల కోసం ఎక్కువకాలం వేచి చూడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్ లోకి రానుందని అంటున్నారు.

అవును... శాంసంగ్, వన్ ప్లస్, వివో మొదలైన బ్రాండ్లు ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో... ఐఫోన్ తో అగ్రగామిగా ఉన్న యాపిల్ త్వరలో ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... 2026 నాటికి యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

నివేదికల ప్రకారం.. ఫోల్డబుల్ ఫోన్స్ తయారుచేయాలనే యాపిల్ పని ఆలోచన దశను దాటి మరింత ముందుకు సాగిందని.. ఇందులో భాగంగా ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ లలో ఉపయోగించి పలు విడి భాగాల కోసం ఆసియాలోని సరఫరా దారులను కూడా కంపెనీ సంప్రదించిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఈ ప్రొడక్ట్ కోసం వీ68 అనే ఇంటర్నల్ కోడ్ ను కూడా సృష్టించిందని అంటున్నారు. ఈ నేపథ్యలోనే ఆసియా టుడే ప్రకారం... కుపెర్టినో ఆధారిత దిగ్గజం ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని అంటున్నారు. దీనికి తాత్కాలికంగా ఐఫోన్ ఫ్లిప్ అని నామకరణం చేశారు.

ఈ క్రమంలోనే యాపిల్ కూడా ఫోల్డబుల్ ఐఫోన్ కోసం పరిశోధన, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 విడుదలకు అంచనాలు వేస్తున్నారు. అయితే... యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికివరకూ మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు!