Begin typing your search above and press return to search.

త్వరలో యాపిల్ వాచ్ అల్ట్రా 2... ఫీచర్స్ పీక్స్!?

దీనికి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ గా సెకండ్ జనరేషన్ యాపిల్ వాచ్ అల్ట్రా 2 ఈ ఏడాది లోనే మార్కెట్ లోకి రానుందని సమాచారం.

By:  Charan Telugu   |   17 July 2023 11:03 AM GMT
త్వరలో యాపిల్  వాచ్  అల్ట్రా 2... ఫీచర్స్  పీక్స్!?
X

స్మార్ట్ ఫోన్స్ తో పాటు స్మార్ట్ వాచ్ ల సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రఖ్యాత యాపిల్ తన స్మార్ట్ వాచ్ అల్ట్రా స్మార్ట్‌ వాచ్ ను 2022లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో యాపిల్ వాచ్ అల్ట్రా - 2 మార్కెట్ లోకి రాబోతుందని అంటున్నారు.

గత ఏడాది లో వచ్చిన యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వచ్చిన ఈ డివైజ్.. అథ్లెట్లు, ఔట్‌ డోర్ యాక్టివిటీస్‌ లో ఎక్కువగా పాల్గొనే వారికి బెస్ట్ ఛాయిస్‌ గా మారిందనే కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు మించి అన్నట్లుగా... దీనికి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ గా సెకండ్ జనరేషన్ యాపిల్ వాచ్ అల్ట్రా 2 ఈ ఏడాది లోనే మార్కెట్ లోకి రానుందని సమాచారం.

ఈ క్రమంలో కొత్త వాచ్‌ లోని కొన్ని టైటానియం మెకానికల్ పార్ట్స్ తయారీకి 3డి ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతున్నట్లు ప్రముఖ టెక్ న్యూస్ వెబ్‌ సైట్ రిపోర్ట్ వెల్లడించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఫీచర్స్ కూడా అడ్వాన్స్డ్ గానే ఉండనున్నాయని తెలుస్తుంది.

అవును... అప్‌ కమింగ్ యాపిల్ వాచ్ అల్ట్రా డిజిటల్ క్రౌన్ సైడ్ బటన్, యాక్షన్ బటన్ వంటి 3డ్-ప్రింటెడ్ మెకానికల్ పార్ట్స్‌ తో రావచ్చని తెలుస్తుంది. సాధారణంగా ఈ భాగాల ను సి.ఎన్.సి. మ్యాచింగ్ ఉపయోగించి తయారు చేస్తారు. అయితే... త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో యాపిల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, ఖర్చుల ను తగ్గించుకోవాల ని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.

ఎన్-210 అనే కోడ్‌ నేమ్‌ తో ఈ కొత్త వాచ్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ సమయం లో... రెండు సిరీస్ 9 వాచ్ మోడల్, ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ ఈవెంట్‌ లో యాపిల్ వాచ్ అల్ట్రా-2 కూడా లాంచ్ కావచ్చని తెలుస్తుంది. ఇదే సమయంలో... యాపిల్ వాచ్ అల్ట్రా 2 ఫీచర్ శరీర ఉష్ణోగ్రతను కొలవగల కొత్త సెన్సార్‌ తో లాంచ్ కావచ్చని తెలుస్తుంది.

అదేవిధంగా... లాంగ్ బ్యాటరీ లైఫ్, న్యూలుక్ డిజైన్, హైయ్యర్ రిఫ్రెష్ రేట్, ఫాస్టర్ ప్రాసెసర్‌ తో ఈ వాచ్ రావచ్చని తెలుస్తుంది. ఇదే సమయం లో... ప్రస్తుత జనరేషన్ యాపిల్ వాచ్ అల్ట్రా 60హెడ్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఆఫర్ చేస్తుండగా... దీనికంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉంటే రన్నింగ్, సైక్లింగ్ వంటి వర్కౌట్ చేసేటప్పుడు కూడా వాచ్ డిస్‌ ప్లేపై స్మూత్‌ గా ఫీచర్లను యాక్సెస్ చేసేలా ఈ వాచ్ ఉంటుందని అంటున్నారట.