ఐఫోన్ 16 స్పెషల్ అట్రాక్షన్ ఆపిల్ ఇంటలిజెన్స్ గురించి మీకు తెలుసా?
ఐఫోన్ తయారీలో తన బ్రాండ్ ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసుకున్న ఆపిల్ మరొకసారి ఫోన్ హైప్ ని పెంచడానికి సిద్ధపడుతుంది.
By: Tupaki Desk | 10 Sep 2024 12:16 PM GMTటెక్నాలజీ పీక్స్ లో ఉన్న ఈ కాలంలో చేతిలో ఫోన్ లేకపోతే అస్సలు గడవదు. మనకు తెలిసిన కంపెనీ ఫోన్లు ఎన్ని ఉన్నప్పటికీ ఐఫోన్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. పిండి కొద్ది రొట్టి అన్నట్టుగా డబ్బు పెట్టే కొద్ది ఐ ఫోన్లో బోలెడన్ని వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఐఫోన్ వాడిన ఎవ్వరైనా సరే వేరే ఫోన్ వాడడానికి ఇష్టపడరు అని అందరూ భావిస్తారు. ఎందుకంటే ఐఫోన్ ఇచ్చే ఫీచర్స్ అలా ఉంటాయి మరి. ఐఫోన్ తయారీలో తన బ్రాండ్ ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసుకున్న ఆపిల్ మరొకసారి ఫోన్ హైప్ ని పెంచడానికి సిద్ధపడుతుంది.
ఈ మేరకు ఐఫోన్ 16 సరికొత్త ఫీచర్స్ ఉన్న మరొక సెట్ తో మార్కెట్లోకి రావడానికి సిద్ధపడుతుంది. కొత్తగా లాంచ్ చేయబోయే ఆపిల్ ఫోన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఆపిల్ ఇంటలిజెన్స్ నిలవనుంది. ఈ సంవత్సరం చివరి నుంచి ఆపిల్ ఇంటలిజెన్స్ తో ఫోన్లు పని చేయడం ప్రారంభమవుతాయి. ఇది యూస్ చేసే వారి అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు వారికి ఓ సరికొత్త ఎక్స్పీరియన్స్ ని అందిస్తుందట.
అయితే నిజంగా ఈ ఆపిల్ ఇంటలిజెన్స్ లో అంత సత్తా ఉందా.. అంటే ఉందని చెప్పాలి మరి.ఎందుకంటే ఇప్పటివరకు ఉపయోగించిన ఐఫోన్లకి ఇకపై ఉపయోగించబోయే ఐఫోన్లకి ఈ ఆపిల్ ఇంటలిజెన్స్ ఫీచర్ కారణంగా భారీవ్యత్యాసాన్ని చూడవచ్చు. అయితే మొదట ఈ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లీష్ లో ప్రారంభించబడుతుంది. తొలిత ఇవి డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూకే ప్రాంతాలలో లభ్యమవుతుంది.
ఫోన్ కాల్ రికార్డ్ చేసే సమయంలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఇండిపెండెంట్గా మీ సంభాషణను కి బీట్లు గా మారుస్తుంది. అంతేకాదు మీరు కాల్ మాట్లాడే సమయంలో చర్చించిన కీలక సమాచారాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఈ ఇంటలిజెన్స్ ఫీచర్ మీరు మాట్లాడే సమయంలో ఎక్స్ప్రెస్ చేసే భావోద్వేగాలను, ఒక టాపిక్ ని డిస్కస్ చేయడానికి తీసుకునే సమయాన్ని బట్టి మీరు మాట్లాడుతున్న మాటల యొక్క సిరియాసిటీని అర్థం చేసుకుంటుంది. అంతేకాదు ఆపిల్ ఇంటెలిజెన్స్ ios 18,ipadOS 18, macOS Sequoia లతో పూర్తిగా విలీనం చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది భాషతో పాటుగా చిత్రాలను అర్థం చేసుకోవడం లో మరింత క్లియర్ గా ఉంటుంది. దీంతో ఇయర్ ఎండింగ్ కి విడుదల కాబోయే సరికొత్త ఆపిల్ ప్రొడక్ట్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.