Begin typing your search above and press return to search.

జియో ఎయిర్‌ ఫైబర్‌ వచ్చేసింది.. ప్లాన్స్ వివరాలివే!

సెప్టెంబర్‌ 19 వినాయక చవితి సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో వైర్‌ లెస్‌ ఇంటర్ నెట్ సర్వీస్‌ "జియో ఎయిర్‌ ఫైబర్‌" ప్రారంభించనుందని ముఖేష్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Sep 2023 4:12 PM GMT
జియో ఎయిర్‌  ఫైబర్‌  వచ్చేసింది.. ప్లాన్స్  వివరాలివే!
X

సెప్టెంబర్‌ 19 వినాయక చవితి సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో వైర్‌ లెస్‌ ఇంటర్ నెట్ సర్వీస్‌ "జియో ఎయిర్‌ ఫైబర్‌" ప్రారంభించనుందని ముఖేష్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ఈ మేరకు వివరాలు వెల్లడించారు. దీంతో... అనుకున్నట్లుగానే జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్ లోకి వచ్చేసింది.

అవును... 5జీ ఆధారిత వైర్‌ లెస్‌ వైఫై సర్వీస్‌ "జియో ఎయిర్‌ ఫైబర్‌" ను మార్కెట్ లోకి విడుదల చేశారు. అత్యంత వేగంతో ఇల్లు, వ్యాపార అవసరాలకు ఇంటర్నెట్‌ ను అందిచేలా ఉన్న వైర్‌ ఆధారిత బ్రాడ్‌ బ్యాండ్‌ ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగా జియో దీన్ని తీసుకొచ్చింది. రెగ్యులర్ ఇన్స్టలేషన్ ప్రోసెస్ అవసరం లేకుండా... జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైంపులో ఈ వైఫై అందుబాటులోకి వచ్చింది!

జియో ఎయిర్‌ ఫైబర్‌ డివైజ్‌ ను ఆన్‌ చేయగానే.. అందులో ఉన్న స్పెషల్ 5జీ రేడియో లింక్‌ ద్వారా దగ్గర్లోని టవర్‌ నుంచి సిగ్నల్స్‌ అందుకొని ఇంటర్నెట్‌ ను అందిస్తుంది. అదీ బ్రాడ్‌ బ్యాండ్‌ కంటే కూడా అధిక వేగంతో అందిస్తుందని కంపెనీ చెబుతుంది. ఇంట్లో ఎన్ని డివైజ్‌ లనైనా దీనికి కనెక్ట్‌ చేసుకోవచ్చు.

ఇక, జియో ఎయిర్‌ ఫైబర్‌ లో అనేక స్పెషల్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా... 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వైఫై 6 సపోర్ట్‌ సహా ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్లను జియో అందిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా సెక్యూరిటీ ఫైర్‌ వాల్‌ కూడా ఉంది. ఇక ఈ జియో ఎయిర్‌ ఫైబర్‌ ను యాప్‌ సాయంతో వినియోగదారులు ఆపరేట్ చేయొచ్చు!

అయితే ప్రస్తుతానికి పరిమిత నగరాలలోనే ఈ జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా... హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌ కతా, ముంబయి, అహ్మదాబాద్‌, పుణె నగరాల్లో జియో ఎయిర్‌ ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దశలవారీగా ఇతర ప్రాంతాలకూ సేవలు విస్తరించనున్నట్లు జియో తెలిపింది.

జియో ఎయిర్‌ ఫైబర్‌ లో రూ.599, రూ.899, రూ.1199 ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో మొదటీ రెండు ప్లాన్స్ లోనూ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌ తదితర ఓటీటీలు లభిస్తాయి. ఇక రూ.1199 ప్లాన్ లో పై సర్వీసులతోపాటు నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైం వీడియో సర్వీస్ కూడా అదనంగా దొరుకుతుంది.

ఇదే సమయంలో జియో ఎయిర్‌ ఫైబర్‌ మ్యాక్స్‌ ప్లాన్స్‌ విషయానికొస్తే... రూ.1499, రూ.2499, రూ.3999 ప్యాక్స్ అందుకాటులో ఉన్నాయి. వీటీన్నింటిలోనూ నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైం వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌, సోనీలివ్‌, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.