Mobile Apps : ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న యప్స్ ఏవో తెలుసా..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ అనేవి అందరి జీవితాలలో ఒక భాగంగా అయిపోయాయి.
By: Tupaki Desk | 12 Nov 2023 4:21 AM GMTప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ అనేవి అందరి జీవితాలలో ఒక భాగంగా అయిపోయాయి. మనిషికి తిండి, నిద్ర ఎంత ముఖ్యమో.. ప్రస్తుతం మనుషులకు మొబైల్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది అందులో అతిశయోక్తి లేదు. ఏ పని చేయాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అలానే అందులో ఒక యప్ ఉంటే చాలు.. ఎక్కడున్నా పనులు జరిగిపోతాయి.
మనకు ఇష్టమైన ఫుడ్ తినాలన్నా.. ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్లడానికి సిద్ధం కావాలి అన్న.. ఎంతో దూరంలో ఉన్న మనిషితో వెంటనే మాట్లాడాలి అన్న.. మన మొబైల్ ఫోన్.. అందులో ఒక యాప్ ఉంటే అన్ని పనులు చకచకా జరిగిపోతాయి.
అందుకే ఇంతలా పెరుగుతున్న డిమాండ్ వల్ల మొబైల్ ఫోన్స్ కోసం రోజుకో యాప్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి..2022లో విపరీతమైన జనాదరణ పొందిన యాప్స్ ఏవి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం..
అందరిని ఆశ్చర్యపరుస్తూ.. ఎప్పుడు 2020లో భారత్ నిషేదించిన 'టిక్‌టాక్' 2022 సంవత్సరంలో అత్యధిక డౌన్లోడ్ పొందిన పాపులర్ యాప్ గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ యాప్ ని దాదాపు 672 మిలియన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా బిజినెస్ ఆఫ్ యాప్స్ ప్రకారం 'టిక్‌టాక్' వార్షిక ఆదాయం 9.4 బిలియన్ డాలర్ల అనగా భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 783 వేల కోట్ల కంటే ఎక్కువ.
ఇక టిక్ టాక్ తరువాత రెండో స్థానంలో.. 547 మిలియన్స్ తో ఇంస్టాగ్రామ్.. మూడో స్థానంలో 449 మిలియన్స్ తో ఫేస్ బుక్.. నాలుగో స్థానంలో 424 మిలియన్స్ తో మనం రోజు వాడే వాట్సాప్.. ఐదవ స్థానం 310 మిలియన్స్ తో టెలిగ్రామ్.. ఆరవ స్థానంలో 210 మిలియన్స్ తో ఫేస్‌బుక్ మెసెంజర్ నిలబద్దాయి.
ఇక గేమ్స్ విభాగంలో 'సబ్వే సర్ఫర్స్' 304 మిలియన్ల వినియోగదారులతో ఎంతోమంది ఇష్టపడే గేమ్ గా మొదటి స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత 'క్యాండీ క్రష్' 138 మిలియన్ల యూజర్లు తో రెండో స్థానంలో నిలిచింది. ఇక షాపింగ్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా 'షీఇన్' ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈ యప్ ని 229 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకోగా.. రెండో స్థానంలో ఉన్న మీషో (Meesho) అప్లికేషన్ కి 210 మిలియన్ యూసర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇక మనీ ట్రాన్స్‌ఫర్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ వాడుతున్న యాప్‌గా 94 మిలియన్ల డౌన్‌లోడ్స్ తో 'ఫోన్ పే' నిలిచింది. ఆ తరువాత 69 మిలియన్ డౌన్‌లోడ్స్ తో గూగుల్ పే రెండో స్థానంలో నిలవగా.. 60 మిలియన్స్ డౌన్‌లోడ్స్ తో పేటియం మూడో స్థానంలో నిలిచింది.
కాగా మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై (238 మిలియన్స్), ఆరోగ్యానికి సంబంధించిన విభాగంలో స్వెట్‌కాయిన్ (52 మిలియన్స్), ఫుడ్ విభాగంలో ఎంసీడోనాల్డ్ (127 మిలియన్స్), ట్రావెల్ విభాగంలో గూగుల్ మ్యాప్ (113 మిలియన్స్), విద్యకు సంబంధించిన యాప్‌లో డుయోలింగో (98 మిలియన్స్) అగ్ర స్థానాల్లో నిలిచాయి.