ఏఐ టెక్నాలజీతో హెచ్.పి. కదిలే కంప్యూటర్... డిటైల్స్ ఇవే!
అయితే మూవబుల్ వైర్ లెస్ కంప్యూటర్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు హెచ్.పీ. ఇమాజిన్ ఈవెంట్లో సరికొత్త ఎన్వీ మూవ్ ను ఆవిష్కరించింది.
By: Tupaki Desk | 7 Oct 2023 3:59 AM GMTకంప్యూటర్ అంటే మూవబుల్ కాదు, ల్యాప్ ట్యాప్ అయితే మూవబుల్ అనేది తెలిసిన విషయమే. అయితే మూవబుల్ వైర్ లెస్ కంప్యూటర్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు హెచ్.పీ. ఇమాజిన్ ఈవెంట్లో సరికొత్త ఎన్వీ మూవ్ ను ఆవిష్కరించింది. పేరుకు తగ్గట్టుగానే కదిలే కంప్యూటర్ ఇది. సంస్థ నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి కదిలే ఆల్ ఇన్ వన్ పీసీ!
అవును... 24 ఇంచెస్ క్యూ హెచ్ డీ డిస్ ప్లే కలిగి ఉన్న కదిలే కంప్యూటర్ ని హెచ్.పి. విడుదల చేసింది. అయితే ఈ కదిలే కంప్యూటర్ ని తీసుకెళ్లడానికి ఎలాంటి బ్యాగ్ అవసరం ఉండదు. కీ బోర్డు ఉంచడానికి, దాన్ని పట్టుకునేందుకు ఓ హ్యాండిల్, ప్యాకెట్ ఉంటుంది అంతే. దీన్ని ఎప్పుడైనా.. ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీని పరిమాణానికి సరిపోయే బ్యాక్ ప్యాక్ డివైజ్ తో ఇది రూపొందించబడింది.
ఈ కంప్యూటర్లో ఒక ప్రత్యేక సెన్సార్ ఉంది. దీని ద్వారా యూజర్లు దీని ఉనికిని గుర్తించడంతో పాటు ఆడియో సిస్టం అందుకు అనుగుణంగా సెట్ చేయబడుతోంది. ఈ ఫీచర్ వల్ల ప్రయోజనం ఏంటంటే.. ఎల్లప్పుడూ ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఆపరేట్ చేయాల్సిన పని ఉండదు. ముఖ్యంగా గేమింగ్ సమయంలో లేదా మూవీస్ చూస్తున్నప్పుడు బాగా ఉపయోగపడుతోంది అని చెబుతున్నారు.
ఇక ఈ ఈ హెచ్.పి. కదిలే కంప్యూటర్ లో 13 జనరేషన్ ఇంటెల్ కోర్ 15 ప్రోచెసర్ తో పని చేస్తుంది. ఇందులో 16జీబీ ర్యాం, 1-టీబీ హార్డ్ డిస్క్ సపోర్ట్ ఉంది. మరింత ప్రత్యేకంగా ఫైల్ షేరింగ్స్, ఫోన్ కాల్స్, మెసేజ్ లు, నోటిఫికేషన్ల కోసం, ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ లకు కనెక్ట్ చేసే ఇంటెల్ యూనిసన్ చిప్ సపోర్ట్ కూడా ఉంది.
వీటితోపాటు ఈ కదిలే కంప్యూటర్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగదారుల ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. అంటే... ఈ కదిలే కంప్యూటర్ నుంచి యూజర్ ఎంత దూరంలో దీన్ని ఉపయోగించాలి.. ఎంత సమయం ఉపయోగించాలి.. వంటి వివరాలు యూజర్లకు స్క్రీన్ టైం రిమైండర్ ఉంటుంది.
ఇలా అద్భుతమైన కొత్త టెక్నాలజీతో హెచ్..పి తీసుకొచ్చిన ఈ కదిలే కంప్యూటర్ ధర ఎంత అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచి వివరాల ప్రకారం ప్రస్తుతానికి దీని ధర అక్షరాల 899.99 డాలర్లు. అంటే... ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.74,796. ఇక ఈ కదిలే కంప్యూటర్ వచ్చే ఏడాది భారత్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.