స్టార్ డైరెక్టర్ కుమార్తెకి కండీషన్లా?
బాలీవుడ్ తరహాలో దక్షిణాది పరిశ్రమలో కుమార్తెల్ని లాంచ్ చేయాలంటే? ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.
By: Tupaki Desk | 9 Aug 2023 12:32 PM GMTబాలీవుడ్ తరహాలో దక్షిణాది పరిశ్రమలో కుమార్తెల్ని లాంచ్ చేయాలంటే? ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. వారసుల్ని తెరపైకి తెచ్చినంత వీజీగా కుమార్తెల్ని తీసుకురారు. హీరో కుమార్తె అయినా..నిర్మాత కుమార్తె అయినా..దర్శకురాలి కూతురైనా ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ గా జరగదు. కళారంగం పట్ల ఎంత ఫ్యాషన్ ఉన్నా లాంచ్ అవ్వాలంటే గనుక తల్లిదండ్రుల్ని ఒప్పించాలి. వాళ్లు ఒకే అనే వరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి.
అయితే ఒక ప్పటి కన్నా ఇప్పుడు రోజులు మారాయి. కుమార్తెల్ని ప్రోత్సహించడం లో ముందుంటు న్నారు. అలాగని పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కొన్ని కండీషన్లతో లాంచ్ అవుతున్నారు. వివాహం తర్వాత అప్పటి పరిస్థితుల్ని బట్టి కెరీర్ ని కంటున్యూ చేస్తున్నారు. చాలా మంది వివాహం తర్వాత కుటుంబ జీవితానికే అంకితమవుతున్నారు. ఆ మధ్య ఓ స్టార్ డైరెక్టర్ కుమార్తె లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే క్రమంలో తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి పెద్ద సావసామే చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో కష్టం..నష్టం తెలిసిన వారు ఇటువైపు గా రావడానికి ఒప్పుకోరు. ఒకవేళ అంగీకరించినా స్వతంత్రంగా ఎదిగాలి తప్ప ఎలాంటి సహాయం ఉండదని చెప్పేస్తారు. ఆ వర్దమాన నటి విషయంలో అలాగే జరిగింది. ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నీ తనకు తానుగా సాధించుకున్న అవకాశాలే.
ఇప్పుడిప్పుడే ఆ బ్యూటీ తెలుగులోనూ ఫేమస్ అవుతుంది. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ కి తన తల్లితో పాటు హాజరైంది. దీంతో ఆ స్వీట్ డాటర్ టాలీవుడ్ లోనూ నటిస్తే బాగుంటుందని అంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్టార్ కిండ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి లీకైంది. తన తండ్రి రెండేళ్ల కెరీర్ ని మాత్రమే నిర్దేశించి ఇండస్ట్రీకి పంపించినట్లు వినిపిస్తుంది.
ఈ లోపు తాను చేయాల నుకున్నదంతా చేసి వచ్చేయాలని ఆదేశాలిచ్చారుట. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తానని ముందే చెప్పారుట. ఆ ప్రామిస్ కి ఒప్పుకున్న తర్వాతే కెమెరా ముందుకు రావడానికి ఆ తండ్రి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకే ఆ నటి ఈ రెండేళ్లలోనే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి...సినిమాలంటే బోర్ కొట్టే విధంగా ఉండాలని భావించి ముందుకెళ్తుందిట.