Begin typing your search above and press return to search.

తెలుగు బిగ్ బాస్ లో టీం ఇండియా మాజీ క్రికెటర్‌..?

తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్‌ వేణు గోపాలరావు బిగ్ బాస్ సీజన్ 7 లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి

By:  Tupaki Desk   |   18 July 2023 8:58 AM GMT
తెలుగు బిగ్ బాస్ లో టీం ఇండియా మాజీ క్రికెటర్‌..?
X

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సీజన్ కు నాగార్జున హోస్టింగ్ చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విజయ్ దేవరకొండ మొదలుకుని బాలకృష్ణ వరకు ఎంతో మందిని బిగ్ బాస్‌ హోస్టింగ్ కోసం నిర్వాహకులు సంప్రదించారు అంటూ వార్తలు వచ్చాయి. చివర కు నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్టింగ్ చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇటీవల బిగ్ బాస్‌ 7 కి సంబంధించిన ప్రోమో షూట్ లో నాగార్జున పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఒక స్టిల్‌ లీక్ అయింది. అందులో 7 వ సీజన్ కు సంబంధించిన సింబల్ ను షో నాగ్ చూపిస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే చాలా మంది చాలా రకాలుగా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరి పేరు కన్ఫర్మ్‌ అవ్వలేదట.

తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్‌ వేణు గోపాలరావు బిగ్ బాస్ సీజన్ 7 లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గతం లో టీం ఇండియా మాజీ క్రికెటర్ ను హిందీ బిగ్ బాస్ లో చూపించిన విషయం తెల్సిందే. ఆ సీజన్ కు మంచి ఆదరణ లభించింది. అందుకే టీం ఇండియా మాజీ క్రికెటర్ అయిన వేణుగోపాలరావు ను సంప్రదించారని.. ఆయన ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.

2005 సంవత్సరంలో మొదటి వన్డే మ్యాచ్ ను ఆడిన వేణుగోపాలరావు మొత్తం 16 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్‌ లో కూడా ఈయన ఆడటం ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్‌ లు జరుగుతున్న సమయం లో తెలుగు కామెంట్రీ అందిస్తున్నారు. క్రికెట్‌ అభిమానుల కు వేణు గోపాలరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ లో ఉంటే కచ్చితంగా మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వేణు గోపాల్‌ రావు ఈ సీజన్ లో ఉండాలని ప్రేక్షకులు అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత.. బిగ్‌ బాస్ టీం అసలు వేణు గోపాల్ రావును సంప్రదించారా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక చివరి దశకు వచ్చింది. ఈ నెల చివర్లో మొదటి ప్రోమోను విడుదల చేయబోతున్నారు. ఇక సెప్టెంబర్‌ లో షో ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బిగ్ బాస్‌ షో ఇప్పటి వరకు ఆరు రెగ్యులర్‌ సీజన్ లు.. ఒక ఓటీటీ సీజన్ ను ముగించుకుని సక్సెస్ అయ్యింది. కనుక ఈ సీజన్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.