మహేష్ గుంటూరు కారం రెండేళ్లా..?
గుంటూరు కారం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ తో మహేష్ మాస్ యాటిట్యూడ్
By: Tupaki Desk | 27 July 2023 3:48 AM GMTమహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు రాగా అతడు కమర్షియల్ గా ఓకే అనిపించినా ఖలేజా మాత్రం నిరాశపరచింది. అయితే ఆ రెండు సినిమాలు థియేటర్ లో కన్నా స్మాల్ స్క్రీన్స్ మీద బాగా ఆడాయి. అతడు సినిమా అయితే స్టార్ మా లో ఎప్పుడు వేసినా ఆడియన్స్ ఆదరించారు. ఖలేజా సినిమా కూడా అదే రేంజ్ లో నాన్ థియేట్రికల్ హిట్ అనిపించుకుంది. ఆ రెండు సినిమాల తర్వాత దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఈ కాంబో సినిమా షురూ అయ్యింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ త్రివిక్రం చేస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై చాలా అంచనాలు ఉన్నాయి.
గుంటూరు కారం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ తో మహేష్ మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ ని మెప్పించింది. సినిమా ముందు ఈ ఏడాది సమ్మర్ అనుకోగా అది కాస్త 2024 సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతికి కూడా వస్తుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది. 2024 సమ్మర్ కి గుంటూరు కారం వాయిదా పడుతుందని ఓ టాక్ వినిపిస్తుంది.
మహేష్ సినిమాల విషయంలో ఈ లేట్ సర్వ సాధారణం అయ్యింది. ఖలేజా ముందు కూడా మహేష్ దాదాపు 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ ఇంప్యాక్ట్ ఖలేజా సినిమా మీద పడింది. ఇప్పుడు సర్కారు వారి పాట తర్వాత కూడా మహేష్ అదే త్రివిక్రం తో గుంటూరు కారం సినిమాకు రెండేళ్లు టైం తీసుకుంటున్నాడు.
సర్కారు వారి పాట 2022 మే 12న రిలీజైంది. గుంటూరు కారం సినిమా కూడా 2024 సమ్మర్ కే రిలీజ్ అంటున్నారు. సో ఒక సినిమా చేసేందుకు మహేష్ కి రెండేళ్ల టైం పడుతుంది. రాజమౌళి లాగా బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లు ఏమైనా చేస్తున్నారా అంటే అది కాదు. అయితే మహేష్ తన తల్లిని, తండ్రిని పోగొట్టుకోవడం వల్ల కొంత కాలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత అయినా స్పీడ్ గా లాగిస్తాడు అనుకుంటే అది జరగలేదు.
ఇక ఈలోపు గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు కొందరు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన వారు కొందరు ఉన్నారు. ఇలా సినిమా షూటింగ్ టైం లో కూడా కాస్ట్ అండ్ క్రూ తీసుకోవడం తప్పకుండా సినిమా మీద ఇంప్యాక్ట్ పడేలా చేస్తుంది. త్రివిక్రం పవన్ కళ్యాణ్ కి, అల్లు అర్జున్ కి డైరెక్ట్ హిట్స్ ఇచ్చాడు కానీ మహేష్ కి ఇవ్వలేదు. మరి గుంటూరు కారం ఆ కల నెరవేరుస్తుందా లేదా అన్నది చూడాలి. మహేష్ గుంటూరు కారం సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా చేస్తున్నారు.