PR వీక్.. ఎన్టీఆర్ తర్వాత చరణ్‌తో ఖాయమేనా?
తాను స్వయం ప్రచారం చేసుకోకపోవడంతో తనను లేదా తన ప్రదర్శనలను ఎవరూ గమనించరని భయపడుతున్నట్లు కూడా జాన్వీ పేర్కొంది
By: Tupaki Desk | 1 Aug 2023 9:38 AM GMTతనదైన అందం ప్రతిభతో ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోవర్లతో భారతదేశంలో పాపులర్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. అయినా కానీ తనకు తగినంత ప్రచారం లభించడం లేదని జాన్వీ భయపడుతోందని తెలిసింది. మంచి PRని నిర్వహించడంలో తాను ఎల్లపుడూ పూర్ అని సదరు యువనాయిక అంగీకరించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో జాన్వీ కపూర్ నటించిన 'బవాల్' సానుకూల సమీక్షలను అందుకుంది. అయితే సెల్ఫ్ ప్రమోషన్ విషయంలో తాను వెనుకబడిపోతున్నానని జాన్వీ అభిప్రాయపడింది. తాను స్వయం ప్రచారం చేసుకోకపోవడంతో తనను లేదా తన ప్రదర్శనలను ఎవరూ గమనించరని భయపడుతున్నట్లు కూడా జాన్వీ పేర్కొంది. సినీ పరిశ్రమ ప్రజా సంబంధాలు సహా దూకుడైన ప్రమోషన్‌ను నమ్ముతుంది. అయినా కానీ ''చేసిన పని తనకు తానుగా మాట్లాడాలి'' అనే సామెతను తాను ఎప్పుడూ నమ్ముతానని యువనాయిక పేర్కొంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో దూసుకెళుతుందని భావిస్తే అది ఏమంత సులువుకాదని అర్థమవుతోంది. తదుపరి రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ నటిస్తుందని ప్రచారమైంది. ఈ సినిమా కోసం చర్చలు జరుపుతోందన్న టాక్ ఉంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ఎన్టీఆర్ దేవరతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. వెనువెంటనే రామ్ చరణ్ సినిమాని ఆమె దక్కించుకుంటే టాలీవుడ్ లో వెనుదిరిగి చూసే పరిస్థితి ఉండదు. జాన్వీ చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి OTT విడుదలైన 'బవాల్'లో కనిపించింది. ప్రస్తుతానికి తెలుగు చిత్రసీమ సహా దక్షిణాదిన తనని తాను ప్రమోట్ చేసుకునేందుకు జాన్వీ ప్రయత్నిస్తోంది. తనకు పీఆర్ కమ్యూనికేషన్ సరిగా లేనందున రేసులో వెనకబడ్డానని ఫీలవుతోంది. ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేస్తుందో చూడాలి.