Begin typing your search above and press return to search.

'కల్కి'లో కమల్ రాక అప్పుడే

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌, బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌, హాట్ బ్యూటీ దీపిక పదుకొణె.. ఇలా భారీ తారాగణంతో 'ప్రాజెక్ట్‌ కె' కల్కి 2898 AD అందరి దృష్టినీ ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   24 July 2023 5:30 AM GMT
కల్కిలో కమల్ రాక అప్పుడే
X

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌, బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌, హాట్ బ్యూటీ దీపిక పదుకొణె.. ఇలా భారీ తారాగణంతో 'ప్రాజెక్ట్‌ కె' కల్కి 2898 AD అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఎప్పుడైతే యూనివర్సల్​ స్టార్​ కమల్‌హాసన్‌ భాగమయ్యారో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్​గా శాన్​ డియాగో కామిక్ కాన్​లో రిలీజైన టైటిల్​ గ్లింప్స్​.. 'ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.

అప్పుడు అంతం అరంభమవుతుంది' అంటూ ఒక్క డైలాగ్​తో సినిమాపై ఊహించని రేంజ్​లో ఆసక్తిని పెంచేసింది. యాక్షన్​ విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. అయితే ఈ గ్లింప్స్​లో కమల్ హాసన్​ను చూపించకపోవడంపై ఓవైపు సినీ ప్రియుల్లో కాస్త అసహనం, అలాగే ఆయన పాత్రపై తెగ ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఏంటంటే.. కమల్​ ఇప్పుడు షూట్​లో జాయిన్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారట.

ఇప్పుడాయన దిగ్గజ దర్శకుడు శంకర్​తో కలిసి భారీ ప్రాజెక్​ ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసుకుని ఆయన ప్రాజెక్ట్ కె సెట్స్​లోకి అడుగుపెడతారని తెలిసింది. ఆగస్టులో లేదా సెప్టెంబర్​లో ఆయన షూట్​లో భాగమవుతారని ఇన్​సైడ్​ టాక్​.

ఇకపోతే ఈ సినిమాలో కమల్ ఉన్నట్లు అనౌన్స్​ చేసినప్పటి నుంచి ఆయన పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సోషల్​మీడియాలో ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే కామిక్​ కాన్​ ఈవెంట్​లో కమల్​.. విలన్​ ఉన్నప్పుడే హీరో ఉంటాడని అంటూ కామెంట్స్​ చేశారు.

దీంతో ఆయనది విలన్​ పాత్ర అని దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. ఇక సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బహు భాషా చిత్రాన్ని నిర్మాత అశ్వినీ దత్​ దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​తో రూపొందిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మూవీటీమ్​ సన్నాహాలు చేస్తోంది. అందుకు తగట్టు షూటింగ్​ను ప్లాన్​ చేస్తూ ముందుకెళ్తోంది.