Begin typing your search above and press return to search.

న‌కిలీ జంట ఆఫ‌ర్ల కోస‌మే పెళ్లాడారు.. ప్రేమ‌తో కాదు: కంగ‌న

వివాదాల క్వీన్ కంగనా రనౌత్

By:  Tupaki Desk   |   19 July 2023 3:52 AM GMT
న‌కిలీ జంట ఆఫ‌ర్ల కోస‌మే పెళ్లాడారు.. ప్రేమ‌తో కాదు: కంగ‌న
X

వివాదాల క్వీన్ కంగనా రనౌత్ మ‌రోసారి సోష‌ల్ మీడియాల్లో చెల‌రేగింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పాపుల‌ర్ సెల‌బ్రిటీ క‌పుల్ రణబీర్ కపూర్ -ఆలియా భట్ లను పేరు పెట్టకుండా పరోక్షంగా నిందించింది. రణబీర్- అలియా జంట మాఫియా డాడీ ఒత్తిడితో వివాహం చేసుకున్నార‌ని కంగ‌న‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పెళ్లాడితే ఈ జంట‌కు 'మూడు సినిమాల ట్ర‌యాల‌జీ ఆఫ‌ర్' ఇస్తాన‌ని వాగ్దానం చేశాడు.. అంటూ విమ‌ర్శించింది. ఈ ఎపిసోడ్ లో మాఫియా డాడీ ఎవ‌రో అర్థం చేసుకోవ‌డం సులువు. ప్ర‌తిసారీ క‌ర‌ణ్ జోహార్ ని బాలీవుడ్ మాఫియా డాడీ అంటూ కంగ‌న టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌బీర్ - ఆలియా జంట‌ అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'బ్రహ్మాస్త్ర'లో న‌టించారు. ఇది మూడు సినిమాల ఫ్రాంఛైజీ అన్న సంగ‌తి తెలిసిందే.

కంగనా తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసింది. ''ఫ‌ర్జీ(న‌కిలీ) జంట కేవ‌లం ఆఫ‌ర్ల కోస‌మే పెళ్లి చేసుకున్నారు. ప్రేమ‌తో కాదు. అత‌డు ప‌ర్య‌ట‌న‌కు వెళితే భార్య పిల్ల‌ల‌ను కూడా తీసుకుని వెళ్లాలి క‌దా? కానీ అలా చేయ‌లేదు. ఈ జంట న‌కిలీ కాపురం బ‌హిర్గ‌తం కావాలి'' అంటూ కంగ‌న తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య‌లు ర‌ణ‌బీర్ - ఆలియా జంట‌ను ఉద్ధేశించి అన్న‌ది అభిమానులు వెంట‌నే గ్ర‌హించారు. మ‌రో ఇన్ స్టా కామెంట్ లోను కంగ‌న చెల‌రేగిపోయింది.

సినిమా ప్రమోషన్ లు ..డబ్బులు లేదా పని కోసం పెళ్లి చేసుకుంటే ఇలా జరుగుతుందే తప్ప స్వ‌చ్ఛంగా ప్రేమించి పెళ్లాడితే ఇలా కాదు...మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్న ఈ నటుడికి సినిమాల ఆఫ‌ర్ వాగ్దానం ప‌ని చేసింది. మూడు సినిమాల ఫ్రాంఛైజీ అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు అతను నకిలీ వివాహం నుండి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.... కానీ పాపం ఇప్పుడు అతడిని ప‌ట్టించుకునేవారు ఎవరూ లేరు.... అతను తన భార్య కుమార్తెపై దృష్టి పెట్టాలి... ఇది ఇండియా ఏక్ బార్ షాదీ హో గయీ తో హో గయీ... ఆబ్ సుధార్ జావో (ఒకసారి పెళ్లి జరిగితే వెనక్కి తగ్గేది లేదు... మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి)'' అని తీవ్రంగా వ్యాఖ్యానించింది కంగ‌న‌.

అయితే కంగ‌న చేసిన ప‌నికి నెటిజ‌నుల నుంచి తీవ్ర‌మైన స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఇంత‌కుముందు ర‌ణ‌బీర్ - ఆలియా జంట‌ను వారి కుటుంబాల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసిన కంగ‌న ఇప్పుడు ఈ దంప‌తుల ఆరు నెల‌ల‌ ప‌సికందును కూడా టార్గెట్ చేసింది. ఇది క్రూర‌మైన చ‌ర్య‌.. ఆమె అస‌హ్య‌క‌ర‌మైన ఆడ‌ది! అంటూ తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ కంగ‌న‌ను విమ‌ర్శిస్తున్నారు. ఆమె ఒక జంట గురించి వారి వ్యక్తిగత సమీకరణాల గురించి సోషల్ మీడియాలో అంత తేలికగా ఎలా వ్యాఖ్యలు చేయగలదు? అని కూడా నెటిజ‌నులు ప్ర‌శ్నించారు.

ఈ మహిళ(కంగ‌న‌) ఇంత ఖాళీ సమయాన్ని ఎలా కలిగి ఉంది? ఆమె తనను తాను అత్యంత కష్టపడి పనిచేసే నటిగా నిర్మాతగా దర్శకురాలిగా అవార్డు గెలుచుకున్న మహిళా యాక్షన్ స్టార్ గా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వివాదంలో త‌ల‌దూర్చ‌డానికి రోజంతా సమయం ఉంది. ఈ రకమైన ప్రవర్తన సాధారణమైనది కాదు. ఆమెకు ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. త‌న చుట్టూ బాకా ఊదే వ్య‌క్తులు ఉన్నారు.. అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కంగనా తదుపరి పొలిటిక‌ల్ డ్రామా 'ఎమర్జెన్సీ'లో భారతదేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్ లో స్వీయ‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో మిలింద్ సోమన్- అనుపమ్ ఖేర్ - శ్రేయాస్ తల్పాడే - దివంగత నటుడు సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయనున్నారు.