పాపం ఆమె ఎంత బాధ పడుతుందో..!
గత కొన్నాళ్లుగా హీరోయిన్ అనుశ్రీ తో ఉన్ని ముకుందన్ ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని, అందుకే ఆమె తో నటిస్తున్నాడు అంటూ మలయాళ మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
By: Tupaki Desk | 2 April 2024 8:30 AM GMTమలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తెలుగు లో జనతా గ్యారేజ్ తో పాటు భాగమతి మరియు యశోద ఇంకా పలు డబ్బింగ్ సినిమాలతో సుపరిచితుడు అయ్యాడు. ఈయన ప్రస్తుతం మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.
మలయాళ హీరోల్లో ఎక్కువ శాతం మంది పెళ్లి అయిన వారే ఉన్నారు. పెళ్లి కాని వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఉన్ని ముకుందన్ ఒకరు. ఆయన ప్రేమలో పడ్డాడు, రిలేషన్ లో ఉన్నాడు అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో రెగ్యులర్ గా పుకార్లు షికార్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఉన్ని ముకుందన్ జై గణేష్ అనే సినిమాలో నటించాడు. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా ప్రమోషన్ లో ఈయన పాల్గొంటున్నాడు. మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు.
గత కొన్నాళ్లుగా హీరోయిన్ అనుశ్రీ తో ఉన్ని ముకుందన్ ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని, అందుకే ఆమె తో నటిస్తున్నాడు అంటూ మలయాళ మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నెట్టింట ఈ పుకార్లకు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. హీరోగారి రియాక్షన్ ఏంటో అంటూ చాలా రోజులుగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
జై గణేష్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అనుశ్రీ విషయం పై స్పందించాడు. ప్రస్తుతం తాను అనుశ్రీ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాను. అంతే తప్ప ఆమెతో నేను ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నాడు.
ఆమె ఇండస్ట్రీకి కొత్త. ఇలాంటి పుకార్లు రావడం వల్ల ఆమె ఆందోళనకు గురి అయ్యే అవకాశం ఉంది. ఆమె ఎంతగా బాధ పడుతుందో అన్నట్లు ఉన్ని ముకుందన్ మీడియా కథనాలపై అసహనం వ్యక్తం చేశాడు. ఇకపై అయినా తమ ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం అంటూ రాయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశాడు. మరి ఉన్ని ముకుందన్ మాటలను మలయాళ మీడియా వర్గాల వారు నమ్మి ప్రేమ పుకార్లు ఆపేస్తారా చూడాలి.