Begin typing your search above and press return to search.

ఇన్‌స్టాలో భ‌ర్త‌ను అన్ ఫాలో చేసిన న‌యన్?

ప్రస్తుతం నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతోంది. అత‌డిని ఇంతకు ముందు అన్‌ఫాలో చేసినా అది పొర‌పాటున జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 1:38 PM GMT
ఇన్‌స్టాలో భ‌ర్త‌ను అన్ ఫాలో చేసిన న‌యన్?
X

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త విఘ్నేష్ శివన్‌ను అన్‌ఫాలో చేసినట్లు క‌థ‌నాలు రావ‌డం అభిమానుల‌ను కంగారు పెట్టింది. దీనిపై ఆన్‌లైన్‌లో ర‌క‌ర‌కాల‌ ఊహాగానాలు సాగాయి. ఇంత‌కుముందు దీనిపై రెడ్డిట్ పోస్ట్ వైర‌ల్ కాగా.. ఆ ఇద్ద‌రి బంధంలో ఏం జ‌రిగిందో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఫైర్ యాడెడ్ టు ది పెట్రోల్! అన్న చందంగా నయనతార క్రిప్టిక్ పోస్ట్ మంట‌లు రేపింది. ఈ పోస్ట్ లో 'క‌న్నీళ్లు ఉబికి వ‌స్తున్న‌ప్పుడు కూడా .. ఇదే నాకు మిగిలింది అని చెప్ప‌డం కూడా మాన‌దు' అంటూ సందేహాన్ని రాజేసే వ్యాఖ్య‌ను జోడించింది. ఆమె కళ్ళలో కన్నీళ్లతో కూడా ఉంది. ఈ వింత మెసేజ్ ఒక్క‌సారిగా చాలా సందేహాల‌కు తెర‌లేపింది. నయనతార -విఘ్నేష్ శివ‌న్ ల‌ మధ్య ఏం జ‌రుగుతోంది? అంతా స‌వ్యంగానే ఉందా? అంటూ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

ప్రస్తుతం నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతోంది. అత‌డిని ఇంతకు ముందు అన్‌ఫాలో చేసినా అది పొర‌పాటున జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. వారు గ‌తంలో షేర్ చేసిన ఫోటోలు ఆమె ప్రొఫైల్‌లో ఉన్నాయి. నిజానికి ఈ జంట సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. వారి సంబంధం గురించి బహిరంగంగా ప్రతిదీ అభిమానులకు చెబుతుంటారు. వారి కవలలు ఉయిర్ - ఉలాగ్‌లయ అంద‌మైన ఫోటోల‌ను కూడా షేర్ చేస్తుంటారు. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేనంత అన్యోన్యంగా క‌నిపిస్తుంటారు. కానీ ఇంత‌లోనే ఇప్పుడు ఈ వార్త‌లు అభిమానుల‌ను గంద‌ర‌గోళంలోకి నెట్టేస్తున్నాయి.

ఇటీవ‌ల ప్రేమికుల రోజున విదేశాల్లో రొమాంటిక్ యాత్ర‌ను సాగించిన న‌య‌న్ - విఘ్నేష్ నుంచి ఇది ఊహించ‌నిది. అస‌లేం జ‌రుగుతోందో అంటూ అభిమానులు గంద‌ర‌గోళంలో ఉన్నారు. అయితే అన్నిటికీ ఈ జంట నుంచి స‌రైన స‌మాధానం రావాల్సి ఉంటుంది. ఇప్పుడే ఈ జంట‌పై అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దు!