Begin typing your search above and press return to search.

కమల్ సినిమా కథతో జవాన్..?

అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన జవాన్ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

By:  Tupaki Desk   |   1 Sep 2023 8:51 AM GMT
కమల్ సినిమా కథతో జవాన్..?
X

సినిమా మాధ్యమాలు పెరగడం వల్ల ఫలానా సినిమా ఆ సినిమాకు దగ్గరగా ఉందని.. ఆ సినిమా ఫలానా సినిమాకు కాపీ పేస్ట్ అని.. ఆ సినిమా కథ అక్కడ నుంచి ఎత్తేశారు అని ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తాయి. ముఖ్యంగా సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగానే కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ సినిమా కథ అదే అని.. ఆ సినిమాను మళ్లీ తీశారని చెప్పేస్తున్నారు. సేం ఇప్పుడు అలాంటి హడావిడే త్వరలో రిలీజ్ కాబోతున్న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాపై జరుగుతుంది.

అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన జవాన్ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అఫ్కోర్స్ యాక్షన్ పాళ్లు కాస్త ఎక్కువ అనిపించినా బాద్షా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలంటే ఆమాత్రం ఉండాల్సిందే అని అంటున్నారు. అయితే ఈ సినిమా కథ ఒకప్పటి కమల్ హాసన్ తీసిన ఓరు కతియిన్ డైరీ తెలుగులో ఖైదీ వేట సినిమాకు దగ్గరగా ఉందని అంటున్నారు. మొదటి నుంచి జవాన్ పై ఈ కామెంట్స్ వస్తుండగా ట్రైలర్ చూశాక అవి ఇంకాస్త ఎక్కువయ్యాయి.

జవాన్ సినిమా ట్రైలర్ ప్రకారం ఇందులో షారుఖ్ ఖాన్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు. ఇది ఒక తండ్రి కొడుకుల కథ. తండ్రి రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటే కొడుకు పోలీస్ ఆఫీసర్ గా మారి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కమల్ సినిమాలో తనకు అన్యాయం చేసిన వాళ్ల అంతం చేసేలా హీరో శ్రీదేవిని కిడ్నాప్ చేస్తాడు. అయితే దాన్నే జవాన్ సినిమాలో మెట్రో ట్రైన్ హైజాక్ గా మార్చారు. ఇక కమల్ సినిమాలో తండ్రి పాత్ర ఒక పేదవాడు కాగా షారుఖ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆర్మీలో పనిచేసినట్టు చూపించారు.

అంతేకాదు జవాన్ ని వందల కోట్ల బడ్జెట్ తో తీస్తే కమల్ ఖదీ వేట చాలా తక్కువ బడ్జెట్ లో చేశారు. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. మరి కమల్ సినిమా కథను పోలిన కథతో జవాన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడన్నది చూడాలి. ఇది మాత్రమే కాదు అట్లీ ఇదివరకు కూడా విజయ్ తో చేసిన తేరి సినిమా విజయ్ కాంత్ క్షత్రియుడు సినిమా నుంచి తీసుకున్న పాయింటే అని ఆడియన్స్ కనిపెట్టారు. సో అలా ఒకప్పటి కథను ఇప్పటి తరానికి మార్చి తీసి హిట్లు కొడుతున్నాడు అట్లీ. జవాన్ విషయంలో అతని పనితనం హిట్ అనిపించుకుంటుందా లేదా అన్నది చూడాలి.