Begin typing your search above and press return to search.

RC 16: ఆ హీరోయిన్ కు ఛాన్స్ దక్కేనా?

తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా స్లమ్ డాంగ్ హస్బెండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉప్పెన సినిమా కోసం తెలుగు హీరోయిన్ ని తీసుకోవాలని చాలా ప్రయత్నం చేసాను. అయితే సెట్ కాలేదు. కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అయితే నెక్స్ట్ మూవీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని తేల్చేశారు.

By:  Tupaki Desk   |   30 July 2023 4:57 AM GMT
RC 16: ఆ హీరోయిన్ కు ఛాన్స్ దక్కేనా?
X

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జోడీగా వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అందుకొని సుమారు వంద కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఉప్పెన మూవీలో నటించిన కృతి శెట్టి ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలు అందరూ కూడా కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడ్డారు.

ఈ కారణంగానే నాని, నాగ చైతన్య, రామ్ పోతినేని, నితిన్ లాంటి స్టార్స్ తో వరుస సినిమాలు చేసే అవకాశం సొంతం చేసుకుంది. ఉప్పెన తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో రెండు హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తరువాత వరుసగా ఫ్లాప్ లు సొంతం చేసుకుంది. రీసెంట్ గా నాగ చైతన్యతో చేసిన కస్టడీ మూవీ కూడా ఆమె ఖాతాలో డిజాస్టర్ గా మారింది.

దీంతో లక్కీ గర్ల్ కాస్తా ఐరన్ గర్ల్ అయిపొయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క తెలుగు మూవీ ఉంది. అయితే తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తూ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూర్యకి జోడీగా ఈ మూవీలో కృతి శెట్టి నటించనుంది. అలాగే మలయాళంలో కూడా టోవినో థామస్ కి జోడీగా పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా స్లమ్ డాంగ్ హస్బెండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉప్పెన సినిమా కోసం తెలుగు హీరోయిన్ ని తీసుకోవాలని చాలా ప్రయత్నం చేసాను. అయితే సెట్ కాలేదు. కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అయితే నెక్స్ట్ మూవీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని తేల్చేశారు.

కచ్చితంగా తెలుగు హీరోయిన్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని బుచ్చిబాబు తన మాటలలో క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీలీల లాంటి అమ్మాయి ఉప్పెన టైం లో దొరికుంటే బాగుండేది అని కూడా అన్నారు. దీనిని బట్టి రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేయబోయే నెక్స్ట్ మూవీ కోసం శ్రీలీలని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. అయితే గత కొద్దిరోజుల నుంచి జాన్వీ కపూర్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం లేదని బుచ్చిబాబు మాటలతో క్లారిటీ వచ్చింది. చెర్రీ మూవీ ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆమెని ఖరారు చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.