ఆఫ్రికా ని అతలాకుతలం చేస్తున్న మంకీపాక్స్ ను కట్టడి చేయగలమా?
ఎంపాక్స్, మంకీపాక్స్.. ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ తో అన్ని దేశాలను భయానికి గురి చేస్తున్న వ్యాధి
By: Tupaki Desk | 14 Aug 2024 2:30 PM GMTఎంపాక్స్, మంకీపాక్స్.. ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ తో అన్ని దేశాలను భయానికి గురి చేస్తున్న వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మంకీపాక్స్ బారిన పడిన వారి సంఖ్య 13,700 కి చేరుకుంది. ఒక్క డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రాంతంలో సుమారు 450 మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. అందరినీ భయభ్రాంతులను చేస్తున్న ఈ వ్యాధి ఓ వైరస్ కారణంగా వ్యాపిస్తుంది.
ఈ వైరస్ సోకిన వారికి శరీరంపై నీటి బొబ్బలు ఏర్పడతాయి. శరవేగంగా వ్యాప్తిస్తున్న ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ వ్యాధిని కట్టడి చేయకపోతే అత్యధికంగా వ్యాపించడంతోపాటు భయంకరమైన ప్రాణ నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆఫ్రికన్ ప్రభుత్వం భయపడుతోంది. అందుకు అవసరమైనటువంటి అన్ని సన్నాహాలను చేపట్టారు.
ఇక ఈ వైరస్ ఆఫ్రికన్ దేశం నుంచి మిగిలిన దేశాలకు వ్యాప్తిస్తే ఏం చేయాలి అనే విషయంపై కూడా ఆరోగ్య సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల నుంచి సులభంగా అవతల వారికి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి జ్వరం, కండరాల నొప్పులు లాంటి లక్షణాలతో మొదలై క్రమంగా శరీరం పై నీటి బొబ్బలు గా మారుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం మంకీపాక్స్ కు సంబంధించి రెండు స్ట్రెయిన్‌లను డాక్టర్లు గుర్తించారు. 2022లో నాకు ప్రపంచమంతటా వ్యాపించిన మొదటి స్ట్రెయిన్‌లు స్వల్పమైన లక్షణాలు కలిగి ఉండడంతో ఎక్కువ ప్రాణహాని జరగలేదు. కానీ ఇప్పుడు విస్తరిస్తున్న ఈ వైరస్ మరింత ప్రమాదకరమైనదని తెలుస్తోంది.
ఎంపాక్స్‌కు మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వ్యాధి సోకే ప్రమాదంలో ఉన్నవారే కాదు వ్యాధి సోకిన వారు కూడా వేసుకోవచ్చు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఈ వైరస్ కు కోతులకు ఎటువంటి సంబంధం లేదు. కోవిడ్ లాగా ఇది జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి అయినప్పటికీ అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వదు. పైగా ఇప్పటికే దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి అంతగా వ్యాప్తి చెందకుండా నిరోధించే అవకాశం ఉంది.