Begin typing your search above and press return to search.

కోవిషీల్డ్ ఆరోగ్యాలను దెబ్బతీసిందా?

అస్ట్రాజెనికా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ప్రతికూల ప్రభావాలు చూపిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2024 4:30 PM GMT
కోవిషీల్డ్ ఆరోగ్యాలను దెబ్బతీసిందా?
X

కరోనా ఎంతటి నష్టం కలిగించిందో తెలిసిందే. రెండు సంవత్సరాలు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడింది. దీంతో కోవిషీల్డ్ టీకాలు అందరు వేసుకున్నారు. ఫలితంగా కొవిడ్ -19 తగ్గిపోయింది. కానీ టీకాలు వేసుకున్న వారికి పలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనేది ఇప్పటి ప్రధాన ఆరోపణ . . దీంతో చాలా మంది న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు. కోవిషీల్డ్ వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బ తిన్నాయని ఆందోళన బాట పడుతున్నారు.

అస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్ టీకా ప్రాణాంతక థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ వల్ల రక్తం గడ్డ కట్టి ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీసిందని చెబుతున్నారు. దీని వల్ల తమ పిల్లల్ని పోగొట్టుకున్నామని వాపోతున్నారు. లండన్ లోని కోర్టు కూడా వీరి వాదనను అంగీకరించింది. బెంగుళూరు, కేరళ, హైదరాబాద్, ముంబయి, కోయంబత్తూరు, కపుర్తలాకు చెందిన పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అస్ట్రాజెనికా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ప్రతికూల ప్రభావాలు చూపిందని అంటున్నారు. దీంతో చాలా మంది ఆస్పత్రుల పాలు అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో తమ పిల్లలు మరణించారని తల్లిదండ్రులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పోరాటం ఎందాక వెళ్తుందో తెలియడం లేదని చెబుతున్నారు.