Begin typing your search above and press return to search.

ఇట్స్ ఏ మిరాకిల్... తెగిన తలను తిరిగి అతికించారు!

వైద్యశాస్త్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం జరిగింది. ఆల్ మోస్ట్ మెడనుంచి వేరయినట్లున్న తలను వైద్యులు తిరిగి అతికించారు. ఈ ప్రక్రియలో భాగంగా తలను - వెన్నెముకను ముందు అతికించారు. ఈ అరుదైన సంఘటన ఇజ్రాయిల్ దేశంలో జరిగింది.

By:  Tupaki Desk   |   15 July 2023 5:55 AM GMT
ఇట్స్ ఏ మిరాకిల్... తెగిన తలను తిరిగి అతికించారు!
X

వైద్యశాస్త్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం జరిగింది. ఆల్ మోస్ట్ మెడనుంచి వేరయినట్లున్న తలను వైద్యులు తిరిగి అతికించారు. ఈ ప్రక్రియలో భాగంగా తలను - వెన్నెముకను ముందు అతికించారు. ఈ అరుదైన సంఘటన ఇజ్రాయిల్ దేశంలో జరిగింది.

అవును... ఇజ్రాయెల్‌ దేశంలోని జెరుసలేం లో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యు ఒడికి చేరువలో ఉన్న ఓ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. శరీరం నుంచి అంతర్గతంగా విడిపోయిన తలను తిరిగి అతికించారు. ఆధునిక సాంకేతికతకు తమ నైపుణ్యాన్ని మేళవించి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు.

వివరాళ్లోకి వెళ్తే... జోర్డాన్‌ వ్యాలీకి చెందిన పన్నెండేళ్ల సులేమాన్‌ హసన్‌ కు రోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే తప్పనిసరిగా సైకిల్ పై చక్కర్లు కొట్టడం అలవాటట. ఇందులో భాగంగానే ఓ రోజు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన హసన్‌ ను కారు ఢీకొట్టిందట. దీంతో తీవ్ర గాయాలు పాలయిన హసన్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారట.

అయితే హసన్ ను ఆస్పత్రికి తరలించే సమయానికి... హసన్‌ మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యి ఉండటంతోపాటు... తల, శరీరం దాదాపు ఒకదాన్నుంచి మరోటి వేరైన స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. శిరస్సుతో వెన్నెముక చివరి అంచును కలిపి ఉంచే భాగం దాదాపు విడిపోయిందట. ఇదే సమయంలో పొత్తి కడుపులో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారంట.

దీంతో హసన్‌ కే సును జెరూసలేంలోని హదస్సా ఈన్‌ కెరెమ్‌ ఆస్పత్రి వైద్యులు ఓ సవాలుగా స్వీకరించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆస్పత్రిలోని అన్ని విభాగాల స్పెషలిస్ట్‌ డాక్టర్లు కొన్ని గంటలపాటు శ్రమించారని తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో ముందుగా... తల, మెడ కలిసే చోటులోని పూర్తిగా దెబ్బతిన్న లిగ్మెంట్లును పరిశీలించారట. అనంతరం శస్త్రచికిత్స ద్వారా తల, వెన్నెముకను తిరిగి కలిపారని అంటున్నారు.

అయితే ఈ విషయాలపై స్పందించిన వైద్యులు... ప్రమాదం జరిగిన వెంటనే ట్రామా సిబ్బంది సత్వరం స్పందించి ప్రాథమిక చికిత్స అందించడం నుంచి.. ఆపరేషన్‌ చేయడం వరకూ ప్రతి నిర్ణయం హసన్‌ ప్రాణాల్ని నిలబెట్టేందుకు తోడ్పడిందని.. తమ క్లిష్టమైన, తీవ్ర ప్రయత్నం వృథా కాలేదని.. ఆపరేషన్‌ విజయవంతమైందని తెలిపారని అంటున్నారు.