మధ్యయుగం నాటి ప్లేగు వ్యాధి మరోసారి కలకలం!
అవును... అమెరికాలో ఓ అరుదైన వ్యాధి నమోదయ్యింది. ఓరేగాన్ రాష్ట్రంలో ఓ వ్యక్తకి బుబోనిక్ ప్లేగు సోకినట్లు వైద్యులు గుర్తించారు
By: Tupaki Desk | 15 Feb 2024 4:04 AM GMTశాస్త్రం అభివృద్ధి చెందే కొద్ది, కొత్త కొత్త వైరస్ లకు విరుగుడు కనిపెడుతున్న కొద్దీ... మళ్లీ పాత వైరస్ లు కొత్త రూపం సంతరించుకుని విజృంభిస్తున్నాయి! ఇందులో భాగంగా 14వ శతాబ్ధంలో ఐరోపాలో విలయం సృష్టించిన ఒక వ్యాది ఇప్పుడు మరోసారి దర్శనమిచ్చింది. ఈ మేరకు అమెరికాలో ఈ అరుదైన వ్యాధి నమోదైంది. దీంతో... ఈ వ్యాధి చరిత్రను, లక్షణాలను వైద్యులు వివరిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఇది ఇప్ప్పుడు సరికొత్త సమస్యగా చర్చనీయాంశం అయ్యింది.
అవును... అమెరికాలో ఓ అరుదైన వ్యాధి నమోదయ్యింది. ఓరేగాన్ రాష్ట్రంలో ఓ వ్యక్తకి బుబోనిక్ ప్లేగు సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఒకప్పుడు యూరోప్ లో ఈ బుబోనిక్ ప్లేగు వ్యాది వల్ల భారీ నష్టం జరిగింది. మధ్యయుగంలో యూరోప్ లో సోకిన ఈ వ్యాదివల్ల సుమారు మూడవ వంతు జనాభా మృతి చెందిందని తెలుస్తుంది. తాజాగా అమెరికాలో ఓ పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓరేగాన్ రాష్ట్రంలోని డిసెచూట్స్ కౌంటీలో తాజాగా అలాంటి కేసునే గుర్తించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదే సమయంలో అతడి పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జంతువు లేదా ఈగకు సోకిన వారం రోజుల తర్వాత మనిషిలో ఈ ప్లేగు లక్షణాలు ప్రారంభమవుతాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఈ వ్యాధికి సంబంధించి ముందుగా నిర్థారణ చేయకపోతే... ఇది రక్తప్రవాహంలోకి వ్యాపించి.. అక్కడ నుంచి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి.. అనంతరం న్యూమోనిక్ ప్లేగుగా మారి.. పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇతడి విషయంలో లక్కీగా ప్రారంభదశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స అందించగలిగామని చెబుతున్నారు. ఫలితంగా అతని ప్రాణాలకు ప్రమాదం లేదని భరోసా ఇస్తున్నారని తెలుస్తుంది.
జ్వరం, బలహీనత, వికారం, చలి, కండరాల నొప్పులు తదితరాల లక్షణాలు కలిగి ఉన్న ఈ వ్యాది ఈ ప్రాంతంలో చాలా అరుదని చెబుతున్నారు. 2015లో చివరిగా దీనికి సంబంధించిన కేసు నమోదయ్యిందని అంటున్నారు. అయితే... పెంపుడు జంతువులు, ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో ఐరోపాలో విలయం సృష్టించింది. ఫలితంగా... నాటి సంక్షోభం కాల క్రమంలో దీనికి "బ్లాక్ డెత్" అన్న పేరు స్థిరపడింది.