Begin typing your search above and press return to search.

క్యాన్సర్ ను భయపెడుతున్న కోవిడ్?

కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఓ ప్రయోజనం కూడా ఉంది అంటున్నారు ఇంగ్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు.

By:  Tupaki Desk   |   24 Nov 2024 7:43 AM GMT
క్యాన్సర్ ను భయపెడుతున్న కోవిడ్?
X

కోవిడ్ సమయంలో ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తాయో అందరికీ తెలుసు. కోవిడ్ బారిన పడిన వారి బాధ అంతా ఇంత కాదు. మనలో చాలామందికి కొవిడ్ శోకడం వల్ల ఆరోగ్యం పై పడే దుష్ప్రభావాల గురించి మాత్రమే తెలుసు.. కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఓ ప్రయోజనం కూడా ఉంది అంటున్నారు ఇంగ్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు. మరి ఆ ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం పదండి..

అస్తవ్యస్తమైన జీవనశైలి, స్ట్రెస్ కారణంగా ప్రస్తుతం చాలామంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చాప కింద నీరులా ఈ క్యాన్సర్ మన వ్యవస్థను క్షీణింప చేస్తుంది. కీమోథెరపీలో ఎన్ని చేయించుకున్న చాలామందికి ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. పైగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఎంతో రిస్క్ తో కూడుకున్న ట్రీట్మెంట్ అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి కోవిడ్ వైరస్ ఉపయోగపడుతుంది అని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.

‘జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఇన్వెస్టిగేషన్‌’ మేగజైన్ లో ప్రచురించిన వివరాల ప్రకారం క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ వివరాలు తెలిసాయి. ఈ పరిశోధన ప్రకారం.. మన శరీరంలో మైనోసైట్లు అనే తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఇన్ఫెక్షన్లు, వైరస్లు సోకకుండా రక్షణ కల్పిస్తాయి. అయితే కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు వీటిని తమకు అనుకూల కణాలుగా మార్చుకుంటాయి. అందువల్ల మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది.

అయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన సమయంలో మన శరీరంలో ఓ ప్రత్యేక రకమైన మోనోసైట్లు ఉత్పత్తి అవుతాయి అని పరిశోధనలో తేలింది. ఇవి క్యాన్సర్ వ్యతిరేక గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.