Begin typing your search above and press return to search.

కాల్షియ, విటమిన్ డీ3 మాత్రలు వాడుతున్నారా?... ఒక్క నిమిషం!

తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీ.డీ.ఎస్.సీ.వో) సెప్టెంబర్ నెలలో తన నెలవారీ నివేదికను ప్రచురించింది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 5:30 AM GMT
కాల్షియ, విటమిన్  డీ3 మాత్రలు వాడుతున్నారా?... ఒక్క నిమిషం!
X

సాధారణంగా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, ఇంతమాత్రం దానికే డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం లేదు అని భావించిన చాలా మంది మెడికల్ షాపుకు వెళ్లి మాత్రలు తెచ్చుకుని వేసుకుంటుంటారు. అయితే.. వాటిలో నాణ్యత పరీక్షలో విఫలమైన మాత్రలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు.

ఇక ఇటీవల కాలంలో నకిలీ మందులు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని మందులకు సంబంధించిన వార్తలు తరచూ కనిపిస్తున్నాయి ఈ సమయంలో తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీ.డీ.ఎస్.సీ.వో) సెప్టెంబర్ నెలలో తన నెలవారీ నివేదికను ప్రచురించింది. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెల్లడించింది.

అవును... సీడీఎస్సీవో సెప్టెంబర్ నెలకు సంబంధించిన తన నెలవారీ నివేదికను ప్రచురించింది. ఇందులో భాగంగా... మొత్తం 3,000 ఔషదాలలో అవసరమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని 49 ఔషద ఉత్పత్తులను గుర్తించినట్లు తెలిపింది. నకిలీ కంపెనీలు తయారు చేసిన నాలుగు మందులను ఫ్లాగ్ చేసింది.

ప్రధానంగా లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన కాల్షియం 500 ఎంజీ, విటమిన్ డీ3 మాత్రలు నాణ్యత పరీక్షలో విఫలమైన మందులలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. బ్యాచ్ ల వారిగా ప్రామాణికం కాని మందులను రీకాల్ చేసింది!

ఈ సందర్భంగా స్పందించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చీఫ్ రాజీవ్ సింగ్ రఘువంశీ... ఫ్లాగ్ చేయబడిన ఉత్పత్తుల్లో రెయిన్ బో లైఫ్ సైసెన్స్ నుంచి డోంపెరిడోన్ మాత్రలు, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ ద్వారా మెట్రోనిడాజోల్ మాత్రలు, పుష్కర్ ఫార్మా ద్వారా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఉన్నట్లు తెలిపారు!