Begin typing your search above and press return to search.

పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్యకు కారణాలేంటో తెలుసా?

ఆధునిక కాలంలో తిండి విషయంలో శ్రద్ధ పాటించడం లేదు. ఇష్టారాజ్యంగా ఫుడ్స్ అందిస్తున్నారు

By:  Tupaki Desk   |   19 April 2024 2:30 PM GMT
పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్యకు కారణాలేంటో తెలుసా?
X

ఆధునిక కాలంలో తిండి విషయంలో శ్రద్ధ పాటించడం లేదు. ఇష్టారాజ్యంగా ఫుడ్స్ అందిస్తున్నారు. చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఫిజాలు, బర్గర్లు వంటి వాటిని ఎక్కువగా తినిపిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నారు. మంచి ఆహారాలకు బదులు హాని కలిగించే పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా పిల్లలకు సైతం జబ్బులు వస్తున్నాయి.

పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధులు పెరుగుతున్నాయి. వరల్డ్ లివర్ డే సందర్భంగా ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. చాక్లెట్లు, క్యాండీలు, బర్గర్లు, ఫిజాలు అన్ని పదార్థాల్లో చక్కెర, మైదా ఎక్కువగా వినియోగించడం వల్ల కొవ్వు స్థాయిలు పెరుగుతున్నాయి. జంక్ ఫుడ్స్ వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంతో లివర్ సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో ఊబకాయం సమస్యలు వస్తున్నాయి. తదేకంగా ఎక్కువ సేపు ఫోన్లు చూడటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చిన్నతనంలోనే పిల్లల ఆరోగ్యం దెబ్బ తినడంతో తల్లిదండ్రులు కూడా సతమతమవుతున్నారు. కానీ తిండి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా వారి అజాగ్రత్తగానే చెప్పుకోవచ్చు.

పిల్లలకు తిండి విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించాలి. ఏది పడితే అది తినకుండా చూసుకోవాలని చెబుతున్నారు. నోటికి రుచిగా ఉందని లాగిస్తే అది కడుపులో తిప్పలు పెడుతుంది. అదే నోటికి రుచి లేనిది తినడం వల్ల మన కడుపు ఆరోగ్యకరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మనం తీసుకునే ఆహారం కూడా అదే విధంగా ఉండేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

ప్రస్తుత రోజుల్లో తిండి తినేటప్పుడు ఆలోచించాలి. దాని వల్ల మనకు కలిగే లాభాలు బేరీజు వేసుకుని మరీ తినాలి. లేదంటే కష్టాలు ఎదుర్కోవడం తప్పనిసరి. పిల్లలను చిన్నతనం నుంచి మంచి ఆహారాలు తినేలా అలవాటు చేయడం వల్ల వారు పెద్దయిన తరువాత కూడా చెడు వాటి వైపు మళ్లకుండా ఉంటారు. ఇది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం.