'షుగర్' సమస్య ఉందా? కొవిడ్ తీవ్రత ముప్పు ఉన్నట్లే
కొవిడ్ మహమ్మారి డయాబెటిస్ సమస్య ఉన్న వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని గుర్తించారు.
By: Tupaki Desk | 25 Jan 2024 4:18 AM GMTకొవిడ్ మహమ్మారి విరుచుకుపడిన వేళలో.. కొన్ని అంచనాలు.. వాదనలు పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. అయితే.. అప్పటికి ఆ మాటలకు సంబంధించిన ఆధారాలు.. గణాంకాలు అందుబాటులో ఉండేవి కావు. కాకుంటే.. పెద్ద ఎత్తున కేసుల్ని చూసే వైద్యులు ఈ కీలక విషయాన్ని గుర్తించే వారు.
అయితే.. శాస్త్రీయమైన లెక్కలు ఉండేవి కావు. అలాంటి కొన్ని అంశాలు నిజమన్న విషయాన్ని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి బయటకు వచ్చింది. కొవిడ్ మహమ్మారి డయాబెటిస్ సమస్య ఉన్న వారి మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని గుర్తించారు.
లాన్సెట్.. ఎండోక్రైనాలజీ జర్నల్స్ తో తాజాగా వెల్లడైన రిపోర్టు ప్రకారం..షుగర్ జబ్బుతో ఇబ్బంది పడే వారు కొవిడ్ యేతర అనారోగ్యాలతో కన్నుమూసే ముప్పు ఎక్కువగా ఉందన్న విషయం తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా 138 అధ్యయనాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇతర రీసెర్చ్ సంస్థలకు చెందిన పరిశోధకులు క్రోడికరించారు.ఈ డేటా పరకారం మధుమేహంతో ఇబ్బంది పడే వారు కంటిచూపును కోల్పోయిన ఘటనలు కొవిడ్ తర్వాత పెద్ద సంఖ్యలో నమోదైన విషయాన్ని గుర్తించారు.
మహిళలు.. చిన్నారులు.. ఆరోగ్య పరంగా బలహీనంగా ఉండేవారిలో ఈ తరహా సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నట్లుగా గుర్తించారు. కొవిడ్ తర్వాత పెరిగిన మరణాలతో పాటు.. డయాబెటిస్ ఇష్యూతో ఐసీయూల్లో చేరికలు ఎక్కువ కావటాన్ని ప్రస్తావిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేస్తుందని చెప్పాలి.