మధుమేహం లక్షణాలేంటో తెలుసా?
మధుమేహం వచ్చిన వారికి అతిగా ఆకలి వేస్తుంది. అతిగా ఆకలి వేయడం, నోరు ఎండిపోవడం జరుగుతుంది
By: Tupaki Desk | 16 April 2024 2:30 PM GMTప్రపంచంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. చాప కింద నీరులా భయపెడుతోంది. చాలా దేశాల్లో మధుమేహం ఎలా విస్తరిస్తుంది? డయాబెటిస్ లక్షణాలేంటి? అది ఎలా వస్తుంది? వస్తే దాని వల్ల కలిగే ఇబ్బందులేమిటి? అనే దానిపై అవగాహన తెలుసుకోవాలి. లేదంటే దాని వల్ల ముప్పు ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనే విషయం గ్రహించకోవాలి.
మధుమేహం వచ్చిందని తెలిపే సంకేతాలేంటో తెలుసా?
మధుమేహం వచ్చిన వారికి అతిగా ఆకలి వేస్తుంది. అతిగా ఆకలి వేయడం, నోరు ఎండిపోవడం జరుగుతుంది. మూత్రం కూడా ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో గంటకోసారి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇలా షుగర్ వచ్చిన వారికి కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తే మనం వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సలు తీసుకోవడం తప్పనిసరి.
గ్లూకోజ్ పెరిగితే..
రక్తంలో గ్లూకోజ్ పెరిగితే తలనొప్పి, చూపు మసకబారడం, ఒంట్లో నిస్సత్తువ వంటివి పెరుగుతాయి. ఒంట్లో గాయాలు, పుండ్లు తగ్గవు. మూత్ర కోశ ఇన్ ఫెక్షన్లు ఎక్కువవుతాయి. గజ్జల్లో దురద పెట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలా డయాబెటిస్ సోకితే పలు రకాల లక్షణాలు గుర్తించినప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకోవాలి.
కామవాంఛలు తగ్గుతాయి
మధుమేహం ఉన్న వారికి కామవాంఛలు తగ్గుతాయి. ఆడవారిలో యోని పొడిబారే సూచనలుంటాయి. మగవారిలో 35 నుంచి 70 శాతం మందిలో అంగస్తంభన లోపం ఏర్పడుతుంది. అధిక బరువు, మద్యం, పొగ తాగేవారు ఉన్నవారు దానికి దూరంగా ఉంటే మంచిది. జబ్బును ముందే గుర్తిస్తే మందులు వాడి ఇబ్బందులు లేకుండా ఉంటాయి.