Begin typing your search above and press return to search.

వయసు 40 దాంటిందా ?

40 ఏళ్ల తర్వాత ఉడకబెట్టిన గుడ్డు కచ్చితంగా తినాలి. దీనిలో ప్రొటీన్, విటమిన్ డి, బయోటిన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

By:  Tupaki Desk   |   26 May 2024 9:30 AM GMT
వయసు 40 దాంటిందా ?
X

వయసు ముదురుతుంటే మనిషికి శరీరం సహకరించడం మానేస్తుంది. ఇక మారిన జీవన పరిస్థితులలో తింటున్న ఆహారం మనుషుల శరీర పటిష్టతను తగ్గిస్తుంది. ఇక 40 ఏళ్లు దాటితే అది మరింత క్షీణిస్తుంది. అందుకే మనం తింటున్న ఆహారం విషయంలో శ్రద్ద వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని నిపుణులు సూచిస్తున్నాయి.

40 ఏళ్ల తర్వాత ఉడకబెట్టిన గుడ్డు కచ్చితంగా తినాలి. దీనిలో ప్రొటీన్, విటమిన్ డి, బయోటిన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఉడకబెట్టిన కోడిగుడ్లను తినడం వల్ల కండరాలు తగ్గకుండా శరీరం బలంగా తయారువుతుంది. ఇక పప్పు దినుసులలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ప్రతిరోజు ఈ పప్పులతో కూడిన వంటకాలను తీసుకోవాలి. ఇవి విటమిన్లు, మినరల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఫైబర్‌ను శరీరానికి అందిస్తాయి. దీనివల్ల మలబద్దక సమస్యను నివారించవచ్చు.

పెరుగు, మజ్జిగ సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి ప్రతిరోజు పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. వీటిలో కాల్షియంతో పాటు ప్రో-బయోటిక్స్ ఉంటాయి . ఇది జీర్ణక్రియకు అవసరమైన బ్యాక్టీరియా సంఖ్యను అందిస్తుంది. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఆహారం డార్క్ చాక్లెట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు మొదలైనవి యాంటీఆక్సిడెంట్లను అందించే కొన్ని ఆహారాలు. ఇది రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. .

దీంతో పాటు ఆకుకూరలు తినడం మూలంగా ఐరన్, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు వాటి నుండి లభిస్తాయి. కూరలు, చట్నీ రూపంలో వీటిని వండుకుని తినవచ్చు. ఇది మీ హిమోగ్లోబిన్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ కౌంట్ పెంచుతాయి. ఈ డైట్ మెయింటెన్ చేస్తే కచ్చితంగా 40 ఏళ్ల తర్వాత కూడా సంతోషంగా జీవించవచ్చు