Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరం వేళ షాకింగ్ న్యూస్ చెప్పిన వైద్యులు

కొత్త ఏడాదిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో మన ఆరోగ్యం గురించి అయితే పట్టించుకోవాల్సిందే. ఇప్పుడు రకరకాల రోగాలు మన శరీరాన్ని వేదనకు గురి చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   1 Jan 2024 12:47 PM GMT
కొత్త సంవత్సరం వేళ షాకింగ్ న్యూస్ చెప్పిన వైద్యులు
X

మనిషికి సరైన తిండి, నిద్ర ఉండకపోతే కష్టమే. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేదంటే మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. మంచి ఆరోగ్యంతో ఉండాలంటే ప్రస్తుత కాలంలో మనం వైద్యుల సూచనలు పాటించాల్సిందే. లేకపోతే మన ఆరోగ్యం మన చేతుల్లోనుంచి జారిపోవడం ఖాయం. దీంతో పలు రకాల రోగాల బారిన పడి శరీరం శుష్కించిపోవడం సహజం. అందుకే మనం ఆధునిక కాలంలో మన శరీరానికి కొన్ని అలవాట్లు నేర్పడం కామన్.

కొత్త ఏడాదిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో మన ఆరోగ్యం గురించి అయితే పట్టించుకోవాల్సిందే. ఇప్పుడు రకరకాల రోగాలు మన శరీరాన్ని వేదనకు గురి చేస్తున్నాయి. ఈనేపథ్యంలో మనం ఉదయం, సాయంత్రం నడక కొనసాగించాలి. రోజుకు కనీసం 40 నిమిషాలైనా నడిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

రాత్రి భోజనం చేసిన తరువాత కూడా ఓ 5 నిమిషాలు నడిస్తే బెటర్. ఈ కాలంలో అందరు మద్యపానం, ధూమపానం, శీతల పానీయాల వాడకం అధికం చేస్తున్నారు. దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. లేనిపోని రోగాలు మన దరిచేరడం జరుగుతుంది. అందుకే వీటిని దూరంగా ఉంచితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే రోగాల పాలు కావడం తథ్యం.

మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో నిద్ర కూడా ముఖ్యమైనది. రోజుకు కనీసం 7-8 గంటలైనా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. 5 గంటల కంటే తక్కువ 9 గంటల కంటే ఎక్కువ నిద్ర మంచిది కాదని తెలుసుకోవాలి. మనిషికి మంచి తిండి, నిద్రలే ఆరోగ్యానికి సహకరిస్తాయి. దీంతో మనం కంటి నిండా కునుకు కడుపు నిండా తిండి తగ్గకుండా చూసుకోవడం అలవాటు చేసుకుంటేనే సురక్షితం.

మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిని మనం నిత్యం ఆచరించడం వల్ల మనకు మేలు కలుగుతుంది. రోగాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు తమ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రోజు నడవడం వల్ల సుమారు 25 రకాల రోగాలు దూరమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ అందరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.