Begin typing your search above and press return to search.

అరుదైన బ్లడ్ గ్రూప్... దానం చేసేందుకు 440 కి.మీ. ప్రయాణం!

అవును... ఉత్తర ప్రదేశ్ లోని ఇండోర్ ఆస్పత్రిలో ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   30 May 2024 6:44 AM GMT
అరుదైన బ్లడ్  గ్రూప్... దానం చేసేందుకు 440 కి.మీ. ప్రయాణం!
X

సాధారణ గ్రూపులకు సంబంధించిన బ్లడ్ అంటే ఈ రోజుల్లో కాస్త సులువుగానే దొరుకుతుంది! అయితే బ్లడ్ బ్యాంక్ లలో దొరకని ఒక అరుదైన బ్లడ్ గ్రూప్ "బాంబే బ్లడ్ గ్రూప్" మాత్రం దేశంలోని కేవలం 179మందికి మాత్రమే ఉన్న పరిస్థితి. ఈ సమయంలో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి, పెద్దమనసు చేసుకుని రక్తదానం చేస్తున్నారు!

ఈ సమయంలో తాజాగా ఈ అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ అవసరం పడటంతో ఒక వ్యక్తి తన సొంత ఖర్చులతో సుమారు 440 కిలో మీటర్లు ప్రయాణించి తన పెద్ద మనసు చాటుకున్నారు. దీనికోసం ఆయన మహారాష్ట్రలోని షిర్డీ నుంచి మధ్యప్రదేశ్ కు ప్రయాణించారు. ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట ఆసక్తిగా మారింది.

అవును... ఉత్తర ప్రదేశ్ లోని ఇండోర్ ఆస్పత్రిలో ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే ఆమె బ్లడ్ గ్రూప్ అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్. దీంతో ఆ గ్రూప్ బ్లడ్ కోసం వాట్సప్ లో రక్తదాతల గ్రూప్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆ మహిళ పరిస్థితిని వివరిస్తూ మెసేజ్ లుపెట్టారు. ఇది మహారాష్ట్రలోని రవీంద్ర అష్టేకర్ కు చేరింది.

దీంతో.. మహారాష్ట్రలోని షిర్డీలో హోల్ సేల్ పూల వ్యాపారం చేసుకునే 36 ఏళ్ల అష్టేకర్ మే 25న ఇండోర్ కు చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి చేరి ఆ మహిళకు తన అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో నెట్టింట ఆప్టేకర్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. .

ఈ విషయంపై స్పందించిన ఆప్టేకర్... వాట్సప్ గ్రూప్ లో ఈ మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని.. స్నేహితుడి కారులో 440 కిలో మీటర్లు ప్రయాణించి ఇండోర్ కు చేరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు తనవంతు సాయం అందించగలిగినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు.

కాగా... గత పదేళ్లలో మహారాష్ట్రతో పాటు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ లోని వివిధ నగరాల్లో 8 సార్లు పేద రోగులకు రక్తదానం చేశారట ఆప్టేకర్.