Begin typing your search above and press return to search.

పచ్చి టమాటాల్లో ఉండే ప్రయోజనాలేంటో తెలుసా ?

వీటిలో ఉండే పోషకాలు ఎముకలను బలంగా తయారు కావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

By:  Tupaki Desk   |   16 Jun 2024 2:45 AM GMT
పచ్చి టమాటాల్లో ఉండే ప్రయోజనాలేంటో తెలుసా ?
X

ఉల్లి గడ్డ, మిరపకాయ, టమాట. ఇవి మన వంటింట్లో సాధారణంగా ఉండే కూరగాయలు. ప్రతి వంటకంలో టమాటా వాడడం తప్పనిసరి. అయితే పచ్చి టమాటాల్లో ఉండే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

లైకోపీన్, విటమిన్స్ సి, ఎ, ఇ.. వంటివి చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో బాగా సహాయపడతాయి. ఇవి పచ్చి టమాటల్లో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పోషకాలు ఎముకలను బలంగా తయారు కావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

పచ్చి టొమాటోల్లో క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు A, C, ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టొమాటోలో విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ పచ్చి టొమాటోలను చిన్న పిల్లలకు నిత్యం తినిపిస్తే వారు బలంగాఎదుగుతారు

పచ్చి టమోటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి టొమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడేవారు పచ్చి టమోటాలు తింటే మెరుగైన ఫలితం ఉంటుంది. అలాగే వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధులను నివారిస్తుంది. పచ్చి టమాటలు తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ బాధితులు మంచి ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే లైకోపిన్, ఫైబర్.. వంటి పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, కణజాల నష్టాన్ని నివారించడంలో, మంటను తగ్గించడంలో, సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.