Begin typing your search above and press return to search.

గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా?

ఇలా చిన్నవయసులోనే వచ్చే గుండెపోటును స్పాంటేనియన్ కరోనరీ డిసెక్షన్ అని పిలుస్తారు.

By:  Tupaki Desk   |   23 April 2024 5:30 PM GMT
గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా?
X

ఈ రోజుల్లో గుండెపోటు మామాలైపోయింది. కుర్రాళ్లకు సైతం దీని ప్రమాదం పొంచి ఉంటోంది. పూర్వ కాలంలో ముసలి వారికి వచ్చే గుండెపోటు ప్రస్తుతం చిన్న వయసులోనే పలకరిస్తోంది. దీంతో ప్రాణాలు హరీమంటున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర వంటివి లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇలా చిన్నవయసులోనే వచ్చే గుండెపోటును స్పాంటేనియన్ కరోనరీ డిసెక్షన్ అని పిలుస్తారు. యాభై ఏళ్ల లోపు మహిళల్లో దీని ముప్పు అధికంగా ఉంటుంది. సకాలంలో స్పందించి వైద్యం చేయించుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే. రక్తనాళాల్లో పూడికలతో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తనాళాల మ్య పొర చీలిక వస్తుంది. దీంతో రక్తనాళాలు గూడు కట్టుకుని గోడ పొరలు విడిపోతాయి.

దీనివల్ల రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. మహిళల్లో నెలసరి ఆగిపోవడానికి ముందు 44 ఏళ్ల వయసు నుంచి 53 ఏళ్ల మధ్యలోపు ఈ సమస్య తలెత్తుతుంది. కాన్పు అయిన ఆడవారిలో 15 నుంచి 43 శాతం మంది దీని ప్రభావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.

శారీరకంగా ఒత్తిడికి గురికావడం, ఎస్సీఏడీకి దోహదం చేస్తుందని చెబుతున్నారు. దీని బారిన పడితే సుమారు 50 శాతం మంది తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. 20 నుంచి 30 శాతం మంది కఠిన వ్యాయామం చేసినా గుండెపోటు బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అవగాహన లేకపోవడం కూడా ఇక కారణంగా తెలుస్తోంది.

ప్రస్తుత రోజుల్లో గుండెపోటు బారి నుంచి కాపాడుకోవాలంటే సరైన ఆహారం ఉండాలి. మాంసాహారాలు ఎక్కువగా తినకూడదు. కొవ్వు పెంచే వాటిని దూరంగా ఉంచుకుంటేనే మంచిది. అందుకే గుండెపోటు రాకుండా చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలా మన గుండెను పదిలంగా ఉంచుకోవడానికి మనం చర్యలు తీసుకుంటే మంచిదని పలువురి అభిప్రాయం.