Begin typing your search above and press return to search.

ట్రై చేస్తే.. ‘4’ టీలలో ఏ ఒక్కటి తాగినా పొట్ట కొవ్వుకు కోతే!

కొవిడ్ మహమ్మారి పుణ్యమా అని జరిగిన మంచిలో శారీరక.. మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి.

By:  Tupaki Desk   |   12 Feb 2024 2:45 AM GMT
ట్రై చేస్తే.. ‘4’ టీలలో ఏ ఒక్కటి తాగినా పొట్ట కొవ్వుకు కోతే!
X

కరోనా తర్వాత చాలామందిలో వచ్చిన ఒక ప్రత్యేక మార్పు.. వారి ఆరోగ్యం మీద కాస్తంత ఫోకస్ పెట్టటం. గతంలో తినే దాని గురించి ఆలోచించకుండా తినేసే ధోరణిలోనూ మార్పు వచ్చింది. అంతేకాదు.. శరీరం గురించి.. అందులో డిపాజిట్ అయ్యే కొవ్వు గురించి కూడా కొత్త ఆలోచనలు వచ్చిన పరిస్థితి. కొవిడ్ మహమ్మారి పుణ్యమా అని జరిగిన మంచిలో శారీరక.. మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి.

రోజువారీ వ్యాయామం చేసినా.. తినే తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా.. బరువు తగ్గే విషయంలో మార్పు కొంత ఉండొచ్చు. కానీ.. పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటం మాత్రం అంత తేలికైన విషయం కాదు. పెరిగిన పొట్టను తగ్గించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు.. తాగే పానీయాల విషయంలో తీసుకునే మార్పు పొట్టలోని కొవ్వుకు కోత పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

రోజువారీ తాగే టీలలో పాలకు బదులుగా నీటితో.. అది కూడా వంటిట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకునే టీలతో సలువుగా పొట్ట కొవ్వు తగ్గించే వీలుందని చెబుతున్నారు. గ్రీన్ టీ మొదలు రకరకాల టీలను తాగే వారికి ఖర్చు తాకిడి కూడా ఉంటుంది. కానీ.. అదేమీ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని చూపే నాలుగు టీలను ట్రై చేస్తే.. మార్పు ఖాయమంటున్నారు. అదేమంటే..

1. పసుపు.. పుదీనా టీ

- 1.5 కప్పుల నీళ్లలో చిటికెడు పసుపు.. కొన్ని పుదీనా ఆకులు వేసి చిన్న మంట మీద మరిగించాలి.

- తీపి కోసం పంచదార కాకుండా మంచి తేనె (బ్రాండెడ్ అయితే బెటర్) చేర్చాలి

- రోజూ ఈ టీను తాగటంతో పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించే వీలుంది.

- ఈ టీలో పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

2. అల్లం టీ

- చాలామంది అల్లం టీ తాగుతారు. కానీ పాలతో. కానీ తాగాల్సిన తీరు అది కాదు.

- గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో అల్లాన్ని బాగా దంచాలి.

- దాన్ని పొయ్యి మీద పెట్టి రెండు కప్పుల నీళ్లు కాస్తా ఒక కప్పు అయ్యేంతవరకు మరిగించాలి.

- నీటిని వడకట్టి.. అందులో కాస్తంత నిమ్మరసం.. తేనె కలిపి తాగితే ఎంతో మేలు.

- అల్లంలోని యాంటీఇన్ ఫ్లమేటరీ లక్షణాలు..జింజెరాల్ కొవ్వును వేగంగా కరిగించే వీలుంది. జీర్ణ క్రియకు మేలు.

3. దాల్చిన చెక్క టీ

- గ్లాసు వేడి నీళ్లలో చెంచా దాల్చిన పొడి వేయాలి. బాగా కలపాలి.

- కాస్త తేనె.. నిమ్మరసం కలపాలి.

- అలా రోజూ తీసుకుంటే పొట్ట చుట్టు ఉండే అదనపు కొవ్వు కరిగే వీలుంది.

- శరీరంలో చెడు కొవ్వులను కరిగించటానికి.. జీవ క్రియలను మెరుగుపర్చే గుణం ఈ టీకు ఉంది.

4. అశ్వగంధ టీ

- అశ్వగంధ పొడిని వేడి నీళ్లలో వేసి.. అందులో తేన కలుపుకు తాగాలి.

- ఇది ఒత్తిడిని.. ఆందోళన నుంచి బయటపడేస్తుంది.

- ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు.. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అదనపు కొవ్వును తగ్గిస్తాయి.