అధిక నీరుతాగి ఆసుపత్రి పాలైన మహిళ.. ట్విస్ట్ ఇదే!
తాగాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో నీరు తాగడంతో ఆసుపత్రి పాలయ్యింది ఓ యువతి
By: Tupaki Desk | 31 July 2023 7:52 AM GMTఏదైనా మితంగా ఉంటే ఆరోగ్యం.. అమితంగా తీసుకుంటే అనారోగ్యం అంటారు. అదీ తిండైనా.. మరొకటైనా..!! ఏదైనా మితంగా ఉన్నంత కాలం దానివల్ల ఇబ్బందులు రావని.. అది డబ్బైనా.. జాగ్రత్తలైనా!! ఈ సమయంలో మనిషి మనుగడకు ఎంతో ముఖ్యమైన నీరు అధికంగా సేవించి మృతి చెందింది ఒక మహిళ!
అవును... తాగాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో నీరు తాగడంతో ఆసుపత్రి పాలయ్యింది ఓ యువతి. అయితే అందుకు కారణం ఒక ఛాలెంజ్ కావడం గమనార్హం. ఇంతకీ ఎవరా యువతి.. ఎక్కడ యువతి.. ఏమిటా ఛాలెంజ్ అనేది ఇప్పుడు చూద్దాం!
వివరాళ్లోకి వెళ్తే... కెనడాకు చెందిన ఒక టిక్ టాకర్ యువతి మిచెల్ తాజాగా ఒక ఛాలెంజ్ లో పాల్గొంది. అది "75 హార్డ్" అనే ఫిట్ నెస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ప్రకారం బరువు తగ్గించుకునేందుకు మరే ఇతర ఆహారాన్ని తీసుకోకుండా... 75 రోజుల పాటు కేవలం నీళ్లను మాత్రమే తాగాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వర్క వుట్స్ చేయడంతోపాటు ఏదైనా పుస్తకంలో 10 పేజీలు చదవాల్సి ఉంటుంది. ఇలా రోజూ చేసే కార్యక్రమాలను ఛాలెంజ్ నిర్వాహకులకు పంపించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా... దీంతో మిచెల్ రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడం ప్రారంభించారు.
ఇలా సుమారు 11 రోజులు కొనసాగించిన ఆమె... 12వ రోజు ఆసుపత్రి పాలయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో గడిచిన 11 రోజులూ ఏమేమి కార్యక్రమాలు చేసిందీ ఆమె వివరించింది. ఇందులో భాగంగా రోజుకి ఒక లీటర్ నీటిని మాత్రమే తీసుకున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో 12వ రోజు ఆరోగ్యం సహకరించకపోవడంతో రాత్రంతా బాత్ రూంలోనే గడిపినట్లు తెలిపిన మిచెల్... వికారంగా ఉండడం, తినాలని అనిపించకపోవడం, నీరసంగా ఉండడంతో వైద్యుడిని సంప్రదించినట్లు తెలిపింది. దీంతో... పరీక్షల అనంతరం శరీరంలో సోడియం లోపించిందని.. రోజుకు కేవలం అరలీటర్ కంటే తక్కువ నీటిని తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది.
ఈ సందర్భంగా... రోజూ ఆసుపత్రికి వెళ్తున్నట్లు తెలిపిన మిచెల్... అయినప్పటికీ ఈ ఛాలెంజ్ లో ఓటమిని అంగీకరించను.. దీన్ని మళ్లీ కొనసాగిస్తాను అని చెబుతుండటం గమనార్హం. కాగా... పోడ్ కాస్టర్ అండ్ సప్లిమెంట్ కంపెనీ సీఈవో ఆండీ ఫ్రిసెల్లా 2019లో ఈ ఛాలెంజ్ ను ప్రారంభించారు.